అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా ?

ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌లు కూడా అదే రేంజ్‌లో ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన '90's మిడిల్ క్లాస్ బయోపిక్' సిరీస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. 1990ల నాటి మధ్యతరగతి కుటుంబాల జీవితం, పిల్లలు, తల్లిదండ్రుల అనుభవాలు.. ఆ సమయంలోని సామాజిక పరిస్థితులను ఈ సిరీస్ అత్యంత సహజంగా ప్రదర్శించింది.

ఈ వెబ్ సిరీస్ తోనే పలువురు నటులు బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకప్పుడు హీరోగా రాణించి.. బిగ్ బాస్ ద్వారా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ.. ఈ సిరీస్ లో లీడ్ గా రాణించారు. అలానే యూట్యూబర్ మౌళి కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ సిరీస్‌లోనే సుచితా డేవిడ్ పాల్ పాత్రను పోషించిన స్నేహల్ కామత్ సైతం ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. కనిపించనంత సేపు క్యూట్, సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. ఈ సిరీస్ ద్వారా స్నేహల్ తన ప్రత్యేక గుర్తింపును సాధించింది.

actress-snehal-kamat-latest-photos-goes-viral-on-media

స్నేహల్ కామత్ ఫిల్మోగ్రఫీ..

స్నేహల్ కామత్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ఈ వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌లో మైలురాయి నిలిచిందని చెప్పొచ్చు. 'అరవింద సమేత' సినిమాలో పూజా హెగ్డే స్నేహితురాలి పాత్రలోనూ నటించారు. అలాగే 'కైలాసపురం' అనే వెబ్ సిరీస్‌లో కూడా కనిపించారు. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా నటిస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ. తన హాట్ ఫోటోలతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. గ్లామర్ షోతో అందాలు ఆరబోస్తూ ఫుల్ వైరల్ అవుతోంది. దీంతో అప్పుడు అలా ఉన్న ఆమె.. ఇప్పుడు ఇలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ బ్యూటీ మరిన్ని సినిమాల్లో అలరించి సక్సెస్ అవ్వాలని పోస్టులు పెడుతున్నారు. లేటెస్ట్ గా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ గా మారగా.. మీరు కూడా ఓ లుక్కేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+