ఆ దర్శకుడు నాపై అత్యాచారం చేశాడు : స్టార్ హీరోయిన్

పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి.కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు.

కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్స్ రావడం లేదని కొందరు వాపోతున్నారు. ఇదే సమయంలో హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇదే సమయంలో ఓ హీరోయిన్ కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తమిళ నటి సౌమ్య తన కెరీర్‌లో ఎదురైన అత్యంత దారుణమైన అనుభవాలను చెప్పకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ...కాలేజీలో నాటక పోటీ ప్రదర్శన చూసి నాకు సినిమాల్లో సినిమాల్లో అవకాసం దక్కింది ఓ తమిళ దర్శకుడు నన్ను సంప్రదించారు. నాకు సిని పరిశ్రమ గురించి తెలియదు. అయితే ఓ దర్శకుడు నన్ను చాలా వేధించాడని సౌమ్య తెలిపింది.

actress sowmya about casting couch

మొదట తన భార్య సినిమాని డైరెక్ట్ చేస్తుందని చెప్పి తర్వాతే అతనే దర్శకత్వం చేశాడు. నన్ను తన కూతురు గా చూస్తున్నట్లు అందరికీ చెప్పేవాడు.కొంతకాలానికి అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ఎవరూ లేని సమయం చూసి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతడు తననొక శృంగార బానిసగా చూశాడని.. తన బాధను ఎవరితోనూ చెప్పలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. కూతర్నినని చెప్పి, నాతో పిల్లల్ని కూడా కనాలని ప్రయత్నించాడని ఆమె పేర్కొంది. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగిందని ఆమె చెప్పుకొచ్చింది. అయితే తనను అంత ఇబ్బంది పెట్టిన ఆ దర్శకుడు పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+