అతన్నే పెళ్లి చేసుకుంటా..బాయ్‌ఫ్రెండ్ గుట్టు విప్పిన శ్రీలీల
శ్రీలీల.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు. పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.
ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంతో.. దర్శక-నిర్మాతలందరూ శ్రీలీల వెంట పడ్డారు. శ్రీలీల ఉంటే సినిమా హిట్ అనే అంతలా దర్శక -నిర్మాతలు ఫిక్స్ అయిపోయారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మహేష్ బాబు 'గుంటూరు కారం, పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , నితిన్ 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్', విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది.

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగుతుంది. ఇదిలా ఉంటే శ్రీలీల తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. నాకు కాబోయే భర్త అందగాడు అయ్యి ఉండాలి. అలాగే కుటుంబానికి విలువ ఇచ్చేవాడు కావాలి. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. జోక్స్‌తో తనని నవ్వించాలి. కొన్నిసార్లు నన్ను భరించడం అంత సులభం కాదు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించేవాడు భర్తగా కావాలి...అని శ్రీలీల హింట్ ఇచ్చింది.
అయితే గతంలో ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా .. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు శ్రీలీల అవుననే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కాబోయే భర్త ఇలా ఉండాలాంటూ తన మనస్సులోని కోరికను బయటపెట్టింది. మొత్తనికి బాయ్‌ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకుంటానని శ్రీలీల చెప్పకనే చెప్పినట్టే అయింది. ఇన్ని హింట్స్ ఇస్తున్న శ్రీలీల తన ప్రేమికుడు ఎవరో మాత్రం చెప్పడం లేదు.












Click it and Unblock the Notifications