అతన్నే పెళ్లి చేసుకుంటా.. కాబోయే వాడి గురించి శ్రీలీల ఓపెన్ !
టాలీవుడ్ లోకి "పెళ్లి సందD" సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " శ్రీలీల ". తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన గ్లామర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, డాన్స్ స్కిల్స్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించకపోయినా.. నటిగా మాత్రం ఈ అమ్మడుకు బాగా కలిసొచ్చింది.
బ్లాక్‌బస్టర్ హిట్‌తో వరుస ఆఫర్స్..
ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన "ధమాకా" సినిమాతో శ్రీలీలకు బ్లాక్‌బస్టర్ హిట్ లభించింది. ఈ విజయంతో ఆమెకు మాస్ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే వరుసగా పలు చిత్రాల్లో నటించినా అవి ఫ్లాప్ కావడంతో రేసులో కొంచెం వెనుక పడింది. కానీ "పుష్ప-2"లో ఐటెం సాంగ్ ద్వారా పాన్ ఇండియా క్రేజ్ సంపాదించింది. ఈ పాట ఆమెకు పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది.

శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తోంది. తెలుగులో రవితేజతో "మాస్ జాతర", పవన్ కళ్యాణ్‌తో "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రాలలో నటిస్తోంది. అలాగే అఖిల్ సరసన "లెనిన్"లో కూడా చేస్తోంది. తమిళంలో శివ కార్తికేయన్ సరసన "పరాశక్తి" అనే మూవీలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు హిందీలో కార్తీక్ ఆర్యన్ సరసన "ఆషికీ 3" లో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ ఇంకా సెట్స్ మీద ఉన్నలోపే దోస్తానా 2 చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
మరోవైపు "ఆషికీ 3" షూటింగ్‌లో కార్తీక్ ఆర్యన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోస్ ఆ మధ్య వైరల్ అయ్యాయి. దాంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్త హల్‌చల్ అయ్యింది. అయితే ఇప్పటివరకు శ్రీలీల, కార్తీక్ ఇద్దరూ అధికారికంగా స్పందించలేదు. అయితే రీసెంట్ గా మాస్ జాతర మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ భామ.. తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
శ్రీలీల మాట్లాడుతూ.. తనకు కాబోయే భర్తలో మూడు లక్షణాలు ఉండాలని పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో ఆమెను భరించగలవాడు, ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరించగలవాడు. చక్కని హాస్య చతురతతో నవ్వించే వాడు. ఫ్యామిలీ-మ్యానై ఉండే వాడు.. కావాలని తెలిపింది. అయితే ఈ మూడు లక్షణాలు ఉన్న వ్యక్తి దొరకనంత వరకు పెళ్లికి పెద్ద తొందర లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
నా కథను మానభంగం చేసేశారు..! -
మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..? -
లాగిపెట్టి కొట్టిన అపరిచితుడు.. నడిరోడ్డుపై ఏడుస్తూ హీరోయిన్ గోడు! వీడియో -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’ -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా?











Click it and Unblock the Notifications