సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న నటి తాప్సీ.. వైరల్ అవుతున్న పెళ్లి వీడియో..!
నటి తాప్సీ పేరు తెలియని వారండరు. ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయైమంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొంతమంది హీరోలతో నటించిన ఈ భామకు అనుకున్నంత స్థాయిలో క్రేజ్ రాలేదు. తాజాగా, ఈ బ్యూటీ తన ప్రియుడినే వివాహం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా ఈ అమ్మడు నటించింది. బాలీవుడ్‌లో పెద్ద పెద్ద స్టార్స్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం తాప్సీ పన్ను పెళ్లి వీడియో కాస్త సోషల్‌మీడియోలో తెగ వైరల్ అవుతోంది.
తాప్సీ పన్ను వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథియాస్ బో ను ఆమె పెళ్లి చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. తాజాగా ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో కాస్త నెట్టింట తెగ ట్రెండ్ సెట్ చేస్తోంది. వీరిద్దరి పెళ్లి ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు సమాచారం. దీంతో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కానీ, ఎటువంటి న్యూస్ కానీ బయటకి రాలేదు. కానీ, ప్రస్తుతం సోషల్‌మీడియాలో మాత్రం ఓ వీడియోతెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో తాప్సీ పెళ్లికూతురు గెటప్‌లో కనిపించింది. తన ప్రియుడు దగ్గరికి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంది.

పంజాబీ సంప్రదాయంలో పెళ్లి...
వీరి వివాహం పంజాబీ సంప్రదాయంలో జరిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలొచ్చాయి. వీరిద్దరు వారి పెద్దవారిని ఒప్పించి మరి గతనెల 23న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ వారి పెళ్లి ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు అస్సలు రాలేదు. ఇక నటి తాప్సీ కూడా తన పెళ్లికి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా ప్రకటించిలేదు. అయితే, మార్చి 24న ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగినట్లు సమాచారం. తాప్సీ కీలకపాత్రలో మెరిసిన తప్పడ్ సినిమాలోని తన కోస్టార్ పవైల్ గులాటీ, తాప్సీ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన అభిలాష్ తాప్లియాల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా దిల్లోన్ ఈ పెళ్లి వేడుకకు హాజరయినట్లు తెలుస్తోంది. ఇక, వరుడు తరఫున స్నేహితులు, బంధువులు అతితక్కువ మంది కొందరు హాజరయినట్లు తెలుస్తోంది. వీరి వివాహం గురించి అధికారికంగా ప్రకటించకపోయినా, పెళ్లికి ముందే ప్రియుడితో దిగిన ఫోటోలతో నటి హింట్ ఇస్తూనే ఉన్నారు. తాజాగా హోలీ వేడుకల్లో కూడా వీరిద్దరూ కలిసి పాల్గొన్న ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.
Taapsee Pannu's Simple yet "FAIRYTALE" wedding video with bae Mathias Boe 🥰🫶❤️#TaapseePannu #MathiasBoe #Taapsee #bollywoodactress pic.twitter.com/EKz96Y6TMQ
— cine_sdn (@sdn789_) April 3, 2024












Click it and Unblock the Notifications