స్టార్ హీరోయిన్ కారు యాక్సిడెంట్.. ఒకరు స్పాట్ డెడ్
హీరోయిన్ ఊర్మిల కోఠారె ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్ అయినట్టు సమాచారం అందుతోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..నటి ఊర్మిల కోఠారె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పింది. మెట్రో పనులు చేస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ముంబై సిటీలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఊర్మిల కోఠారె కారులోనే ఉన్నారు.
ఆమెతో పాటు డ్రైవర్ కూడా కారులోనే ఉన్నారని తెలుస్తోంది.ఊర్మిలతో పాటు, కారు డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, వెంటనే అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. దీంతో ఊర్మిల కోఠారెతో పాటు, ఆమె కారు డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా..ఊర్మిల కోఠారె, మరాఠి చిత్రసీమలో తన కెరీర్‌ను ప్రారంభించి, తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది.

ఆమె నటించిన చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా విజయవంతమయ్యాయి. దునియాదారి, శుభ మంగళ్ సావధాన్, తి సద్ధ్యా కే కర్తే వంటి మరాఠీ సినిమాలు పేరు తెచ్చాయి.ఆమె మాయికా, మేరా ససురల్ వంటి హిందీ టీవీ సీరియల్స్, అసంభవ్, ఉన్ పాస్, గోష్టా ఎకా లగ్నాచి వంటి మరాఠీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఊర్మిల కోఠారె తెలుగులో కూడా ఓ సినిమాలో నటించారు. 2014లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా సినిమాతో ఊర్మిల కోఠారె హీరోయిన్‌గా నటించారు.












Click it and Unblock the Notifications