అమ్మడు అందం అదరహో.. కానీ 19 ఏళ్లుగా నో హిట్..!!
సొగసు చూడతరమా అనేలా ఉంటుంది ఆ అమ్మాయి. పాలవంటి రంగు.. అదరగొట్టే ఫిజిక్ తో కుర్రకారును ఫిదా చేసే ఆ ముద్దుగుమ్మకు.. అన్నీ ఉన్నా కూడా అసలైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. గత 19 ఏళ్లుగా పట్టువదలని విక్రమార్కుడి లాగా సినిమాలు చేస్తూనే ఉంటుంది కానీ విజయం మాత్రం వరించట్లేదు. దీంతో "అందాలన్నీ అడవి కాచిన వెన్నెల.. అన్న పదం ఈ హీరోయిన్ కు కరెక్ట్‌గా సరిపోతుందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరూ ?? ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం ???
సోలాపూర్ అందగత్తె..
2006లో తమిళ సినిమా "మదరాసి"తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది "వేదిక". ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆ మరుసటి ఏడాది లారెన్స్‌తో 'ముని' చిత్రంలో నటించి హిట్టు కొట్టింది. అదే ఏడాది నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన 'విజయదశమి'లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో బాణం, దూరంగా దగ్గరగా, రూలర్, రజాకార్, ఫియర్ చిత్రాల్లో నటించినా.. అవి ఆశించిన స్థాయిలో విజయమసాధించలేకపోయాయి.

ఇక ఈ మధ్య కాలంలో లారెన్స్ సరసన ఆమె 'కాంచన 3' ఓ మోస్తరు విజయం సాధించడంతో మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. అంతే కాకుండా ఇటీవల 'యక్షిణి' అనే వెబ్ సిరీస్ కాస్త ఫామ్ లోకి తీసుకొచ్చింది. అందులో లిప్‌లాక్‌లు, రొమాన్స్ సన్నివేశాల్లో వేదిక రెచ్చిపోయి నటించింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు లేకపోయినా తమిళంలో 'ఖజానా', కన్నడలో 'గణ' చిత్రాల్లో నటిస్తోంది. 19 ఏళ్లుగా ఇండస్ట్రీలో దండయాత్ర చేస్తున్నా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం అందుకోలేకపోయింది.
అయితే సినిమాల విషయాన్ని పక్కన పెడితే.. సోషల్‌మీడియా ద్వారా వేదిక యూత్‌ని అలరిస్తూనే ఉంటుంది. క్కువగా ట్రెడిషనల్ లుక్స్‌లో కనిపించే వేదిక, ఈసారి బోల్డ్ లుక్‌తో మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. సముద్రపు ఒడ్డున స్విమ్మింగ్ పూల్‌లో బ్లాక్ బికినీలో వయ్యారాలు పోతోంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. మంచి హిట్ పడితే స్టార్ హీరోయిన్ అవ్వడం గ్యారంటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications