"ఖురాన్" నేర్చుకున్న దురంధర్ డైరెక్టర్ భార్య..
భారతీయ సినీ పరిశ్రమలో తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి యామీ గౌతమ్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించారు. బాలీవుడ్‌లో 'Vicky Donor' వంటి హిట్ చిత్రంతో గుర్తింపు పొందిన యామీ.. తన సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆమె నటించి మంచి క్రేజ్ పొందింది.
తెలుగు ప్రేక్షకులకు 'Nuvvila', 'Gouravam', 'Yuddham', 'Courier Boy Kalyan' వంటి చిత్రాల ద్వారా సుపరిచితురాలయ్యారు. ప్రతి భాషలో విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటన పరిధిని విస్తరించుకున్నారు. ఈ క్రమంలో ఆమె కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రం 'Haq'. ఈ సినిమాలో యామీ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో ఆమె పూర్తిగా మమేకమై నటించడం విశేషం.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన Suparn S Verma, సినిమా మేకింగ్ సమయంలో జరిగిన విషయాలను ఇటీవల వెల్లడించారు. వాస్తవికత కోసం తమ బృందం దాదాపు ఏడాదిన్నర పాటు పరిశోధన చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఇస్లామిక్ చట్టాలు, సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి కథను రూపొందించామని చెప్పారు. Shah Bano case ఈ సినిమాకు ప్రేరణగా నిలిచింది భారత న్యాయ చరిత్రలో సంచలనం సృష్టించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన షా బానో అనే మహిళ తన భర్త ఇచ్చిన త్రిబుల్ తలాక్‌కు వ్యతిరేకంగా పోరాడి, Section 125 CrPC కింద న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. దాదాపు పదేళ్ల పోరాటం తర్వాత ఆమె సుప్రీంకోర్టులో విజయం సాధించడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. యామీ ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమై, మత గ్రంథాలు, ఖురాన్‌ను అధ్యయనం చేసి, పాత్రలో జీవించారని దర్శకుడు ప్రశంసించారు. ఆమె నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే, యామీ 'Uri: The Surgical Strike' దర్శకుడు Aditya Dhar ను ప్రేమ వివాహం చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం తర్వాత ఈ జంట వివాహ బంధంతో ఒకటైంది. ఆదిత్య దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన "దురంధర్" బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.












Click it and Unblock the Notifications