సునీల్ ఒకరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
తెలుగులో టాప్ కమెడియన్ గా ఒకప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు సునీల్. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ హీరోగా మారారు. అప్పుడు సునీల్ ఒక చిత్రానికి 10 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకునేవారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ కూడా మంచి మార్కులే పడ్డాయి. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ కమెడియన్ గా మారారు.
రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో మరింత క్రేజీ అందుకున్నారు. పూలరంగడు సినిమాకు 3 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత అతను నటించిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ కామెడీ రోల్స్ లో నటిస్తున్నాడు. ఇవి కూడా కొన్ని ఫెయిలయ్యాయి. అక్కడి నుంచి నెగెటివ్ పాత్రలు చేయడం మొదలు పెట్టారు. కలర్ ఫొటో సినిమాలో విలన్ గా నటించిన తర్వాత పుష్ప సినిమాతో మంచి పాపులారిటీని పెంచుకున్నారు.

జైలర్ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్ర పోషించాడు. మహావీరుడు సినిమాలో కూడా డిఫరెంట్ రోల్స్ లో నటించారు. ప్రస్తుతం విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న సునీల్ ఒక్కో చిత్రానికి రోజుకు రూ.6 లక్షలు తీసుకుంటున్నాడు. దీనిపై అభిమానులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
హీరోగా కంటిన్యూ అవతున్న సమయంలోనే అవే పాత్రలు పోషించాలా? లేదంటే కమెడియన్ గా ఉండాలా? అనే సందిగ్ధావస్థలో ఉండేవాడు. దీనిపై తన స్నేహితుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా తీసుకున్నాడు. ఆమేరకు కొద్ది సంవత్సరాలు హీరోగానే కొనసాగారు. హిట్స్ లేకపోవడంతో విలన్ గా రూపాంతరం చెందాడు. విభిన్నమైన పాత్రలతో ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నారు.












Click it and Unblock the Notifications