సిద్దార్థ్‌ పెళ్లి అనగానే సెకను కూడా ఆలోచించలేదు.. ఆ తర్వాత సీన్ రివర్స్..!

హీరో సిద్దార్థ్ అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు. తన లవర్ బాయ్ ఇమేజ్ తో అటు తమిళం, ఇటు తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాయ్స్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు సిద్ధార్థ్. ఆ తర్వాత బొమ్మరిల్లు మూవీతో మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్ కాలేదు. అయితే టాలీవుడ్‌లో సినిమాలు మానేసి.. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకున్నారు. ఇక హీరోయిన్ అతిథి రావు హైదరిని ప్రేమించారు. గత ఏడాదిలోనే వీరి వివాహం జరిగింది.

Aditi Rao Hydari Reveals Film Offers Declined After Heeramandi

అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ అతిథి రావు అనేక ఆసక్తికర అంశాలను పేర్కొన్నారు. "హీరామండి సిరీస్‌లో నన్ను ఎంతగానో ఆదరించారు. దీని తర్వాత నాకు అవకాశాలు చాలా వస్తాయని అనుకున్నాను. కానీ ఆ మూవీ తర్వాత సినిమాలే కరవయ్యాయి. ఇక సిద్ధార్థ్ పెళ్లి చేసుకుందాం అనగానే సెకను ఆలోచించకుండా ఓకే చేశాను. సిద్దార్థ్‌ చాలా మంచి మనిషి. పెళ్లి తర్వాత అవకాశాలు మరింత తగ్గాయి" అని అతిథి రావు చెప్పుకొచ్చారు.

Take a Poll

అతిథి రావు తెలుగులో సమ్మోహనం, అంతరిక్షం 9000 కిమీ పర్‌ హవర్‌, వి, మహాసముద్రం చిత్రాల్లో నటించింది. గతేడాది సెప్టెంబర్ లో వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రుల మధ్య తెలంగాణలోని ఓ చారిత్రక ఆలయంలో వీళ్లు పెళ్లిచేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+