'డెకాయిట్' మూవీ ఫస్ట్ రివ్యూ: వస్తాడు.. హిట్టు కొడతాడు.. రిపీట్..!!

టాలీవుడ్ లో చాలామంది యంగ్ హీరోలు ఉన్నారు. అయితే వారిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అడవి శేష్. అందుకు కారణం ఆయన చేస్తున్న సినిమాలే.. లార్జర్ ధాన్ లైఫ్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు ఎప్పుడూ సరికొత్త అనుభూతిని కలిగించడంలో అడవి శేష్ ముందుంటాడు. కెరీర్ బిగినింగ్ నుంచే విభిన్నమైన చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు డెకాయిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అడవి శేష్.

డెకాయిట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ ట్రైలర్ కు అటు ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. మహేశ్ బాబు, ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్స్ ఈ ట్రైలర్ ను ప్రశంసించారు. దాంతో మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గూఢచారి, మేజర్, హిట్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత అడవి శేష్ నటిస్తున్న చిత్రం కావడంతో రిలీజ్ కు ముందు మూవీ రిజల్ట్ పై ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరోసారి అడవి శేష్ హిట్ కొట్టాడని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక డెకాయిట్ మూవీకి ఇటీవల సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ ఇస్తారని అంతా భావించారు. కానీ యూఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. దాంతో ఈ మూవీని 16 ఏళ్లు దాటిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ మూవీలో గత చిత్రాలకు భిన్నంగా అడవి శేష్ ఊర మాస్ పాత్రలో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇంటెన్స్ పాత్రలో నటించింది.

AdiviSesh Decoit Receives Positive First Review Strong Second Half Twists Decoit first review

డెకాయిట్ మూవీలో హరి(అడవి శేష్), జూలియట్(మృణాల్ ఠాకూర్) లవ్ స్టోరీ బాగుందని.. అయితే వాళ్లు ఎందుకు విడిపోయారు అనే కథనం ఆసక్తికరంగా ఉందని టాక్. అలాగే ఫస్టాఫ్ ఆసక్తికరంగా ఉంటుంది.. సెకండాఫ్ లో అద్దిరిపోయే ట్విస్టులతో థ్రిల్లింగ్ క్లైమాక్స్ తో ముగుస్తుందని సమాచారం అందుతోంది. ఇక మూవీలో యాక్షన్ సీక్వెన్స్ లు ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో చూడలేదని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అడవి శేష్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+