నటవారసుడి ఎంట్రీకి కౌంట్ డౌన్..? తారక్ హింట్ ఇదేనా..? స్వీట్ 16(సిక్స్ టీన్‌) లో..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో దూసుకెళ్తున్నారు. ఇటీవల దేవర పార్ట్-1 తో బ్లాక్ బస్టర్ కొట్టారు. అంతకుముందు RRR తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటారు ఎన్టీఆర్. బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి ప్రస్తుతం వార్-2 చిత్రం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ను తారక్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. తారక్ ఫైట్స్, డ్రెస్సింగ్ స్టైల్, మేనరిజం ఆకట్టుకున్నాయి. దీంతో ఎన్టీఆర్ కు మరో బ్లాక్ బస్టర్ రెడీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్ కిడ్స్ ఒకరి తర్వాత మరొకరు గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక మేరకు అనుకున్న టైమ్ కంటే ముందే వస్తున్నారు. అలా మాస్ మహారాజ రవితేజ, మహేశ్ బాబు, అల్లు అర్జున్.. ఇలా చాలామంది పెద్ద హీరోలు ఇప్పటికే తమ వారసులను బాక్సాఫీస్ బరిలోకి దింపారు. అయితే ఇప్పుడు ఆ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ చేరనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అభయ్ రామ్ వయసు 12. అంటే మరో నాలుగేళ్లలో 16 ఏళ్లు వచ్చేస్తాయి. దీంతో స్వీట్ సిక్స్ టీన్(16) లో అభయ్ రామ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అభయ్ రామ్ కు 16 ఏళ్లు నిండితే.. ఓ మాంచి టీనేజ్ లవ్ స్టోరీలో నటించేంత ఏజ్ కు చేరుకుంటాడని ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు.

Adorable Moments NTR Jr and Son Abhay Ram Melt Hearts Online

మరోవైపు ఎన్టీఆర్ కూడా తన 16వ ఏటనే హీరోగా మొదటి సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆయన మొదటి సినిమా నిన్ను చూడాలని 2001లో విడుదలైంది. అప్పుడు ఆయన వయసు 16 అని తెలుస్తోంది. ఇదే ఫార్ములాని అభయ్ రామ్ కూడా ఫాలో అవుతాడో లేదో తెలియాలి. అయితే అభ‌య్ అక‌డ‌మిక్ స్ట‌డీస్ ను కొన‌సాగిస్తున్నాడు. ఇక న‌ట‌న‌లోకి అడుగుపెడ‌తాడా లేదా? అనేదానిపై కుటుంబం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

తాజాగా తారక తన కుమారుడితో కలిసి ఎయిర్ పోర్టులో నడిచి వస్తున్న సీన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తండ్రికి తగ్గట్లుగానే అభయ్ రామ్ కూడా స్టైలిష్ గా ఉన్నాడు. దీంతో ఎన్టీఆర్ ఏదో హింట్ ఇస్తున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే మరి కొన్నేళ్లు ఆగాల్సిందే.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకీ రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవల ఈ చిత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ చిత్రానికి వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+