'కల్కి' విజయంతో ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్ రెమ్యునరేషన్
పాన్ ఇండియా రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898ఏడీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రూ.1050 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి రూ.1200 కోట్ల దిశగా పయనిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం భాగమైంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లను కొల్లగొడుతున్న ఈ సినిమా అమెరికాలో 20 మిలియన్ డాలర్లు సాధించిన తొలిచిత్రంగా అతి త్వరలోనే రికార్డును నెలకొల్పబోతోంది.
దేశంలో తొలి హీరోగా?
భారతదేశంలో ఎదురులేని హీరోగా చెలామణి అవుతున్న ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా తొలి మూడు రోజుల్లో రూ.400 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం అనేది సర్వసాధారణమైపోయింది. దీంతో ప్రభాస్ తో భారీ చిత్రాలను నిర్మించేందుకు అగ్ర దర్శకులు, నిర్మాతలు పోటీపడుతున్నారు. బాహుబలి వరకు ఒక పారితోషికాన్ని తీసుకున్న డార్లింగ్ ఆ తర్వాత భారీగా పెంచారు. తర్వాత కల్కి సంచలన విజయం సాధించడంతో అడగకుండానే నిర్మాతలు ఆయన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారు.

దళపతి విజయ్ కు రూ.180 కోట్లు
కల్కి తర్వాత రాబోతున్న రాజాసాబ్, సలార్2, స్పిరిట్ చిత్రాలకు రూ.200 కోట్ల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. దేశంలో ఇంత పారితోషికం తీసుకుంటున్న హీరోల్లో ఆయనే తొలిస్థానంలో నిలవబోతున్నారు. అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ ఎంత తీసుకుంటున్నారనే విషయమై స్పష్టత లేకపోయినప్పటికీ టాప్-3లో డార్లింగ్ నిలిచారు. దక్షిణాదిలో రూ.200 కోట్లు తీసుకుంటున్న ఏకైకా హీరోగా నిలిచారు. తమిళ స్టార్ హీరో విజయ్ తన చివరి సినిమా గోట్ అని, తర్వాత రాజకీయాలే అనిచెప్పి తన పారితోషికాన్ని రూ.180 కోట్లకు పెంచారు. ప్రస్తుతం ప్రభాస్ రూ.200 కోట్లు తీసుకోవడంతో ఆయనే తొలిస్థానంలో నిలిచారు.












Click it and Unblock the Notifications