అల్లు అర్జున్‌ను రూ.105 కోట్లకు నిండా ముంచిన సంస్థ

తెలుగులో మొట్టమొదటి ఓటీటీ ప్లాట్ ఫాంగా ప్రారంభమైంది ఆహా ఓటీటీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మరో ఇద్దరు భాగస్వాములతో కలిసి దీన్ని ప్రారంభించారు. మొదట్లో బాగా పేరు తెచ్చుకుంది. తెలుగులో మొదటి సంస్థ కావడంతో ఎన్నో కొత్త చిత్రాలను టెలికాస్ట్ చేయడంతోపాటు వెబ్ సిరీస్ లు, ఇతర భాషలకు చెందిన సినిమాలను కూడా ప్రసారం చేశారు. ప్రధానంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ షో ఆహా ఓటీటీకి బాగా పేరు తీసుకురావడమే కాకుండా వినియోగదారుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కరోనా సమయంలో విపరీతమైన పాపులారిటీని పొందింది. దీనికతోడు అల్లు అర్జున్ దీనికోసం ప్రచారం చేయడం కూడా కలిసివచ్చింది.

ఖర్చు రూ.277 కోట్లు
అటువంటి సంస్థ ముగిసిన ఆర్థిక ఏడాదిలో రూ.105 కోట్ల నష్టాలను చవిచూసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.105 కోట్ల నష్టాలు వచ్చాయని ఆహా ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. సంస్థలో ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వల్ల ఆదాయం రూ.133 కోట్లుగా ఉందని, అలాగే ఇతరత్రా ఆదాయం రూ.4 కోట్లు వచ్చిందని, మొత్తం కలిసి రూ.137 కోట్ల ఆదాయం ఉన్నట్లు వెల్లడించింది. అయితే నిర్వహణ వ్యయం రోజురోజుకు పెరుగుతోందని, దీనివల్ల ఖర్చులు పెరిగి రూ.277 కోట్లకు చేరాయని తెలిపింది. అందువల్లే రూ.105 కోట్ల నష్టాలను చవిచూడాల్సి వచ్చినట్లు పేర్కొంది.

aha OTT has announced a loss of Rs 105 crore for the financial year 2023-24

మెరుగుపడిన ఆహా పనితీరు
గతేడాదితో పోలిస్తే సంస్థ పనితీరు మెరుగుపడింది. గత ఆర్థిక సంవత్సరానికన్నా ఈ ఆర్థిక సంవత్సరంలోనే అధిక ఆదాయం వచ్చింది. 20222-23లో రూ.122 కోట్లు ఉన్న ఆదాయం 2023-24లో రూ.137 కోట్లు అయింది. అందుకు తగినట్లుగానే నష్టాలను కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. గతేడాది రూ.120 కోట్ల నష్టం రాగా, ఈ ఆర్థిక ఏడాదికి అది రూ.105 కోట్లకు తగ్గింది. తెలుగులో మొదటిసారిగా ఓటీటీని ప్రారంభించిన తర్వాత తమిళంలో కూడా ప్రారంభించారు. స్థానికంగా ఉండే సినిమాలతోపాటు ఇతర భాషల నుంచి వచ్చిన సినిమాలను డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. 13 శాతం మేర నష్టాలను తగ్గించుకున్నామని, రానున్న ఆర్థిక ఏడాదిలో వీటిని మరింత తగ్గించుకునేలా కృషిచేస్తామని, భవిష్యత్తులో అత్యధిక ఆదాయాన్ని పెంచుకునేందుకు దృష్టిపెడతామని సంస్థ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+