చేతికి బ్యాండేజ్‌తో కేన్స్ ఫెస్టివల్‌కు హాజరైన ఐశ్వర్యరాయ్..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. తన అందం, నటనతో ఎందరో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు ఈ నటి. ఈ వయసులో కూడా తరగని అందంతో ఎందరినో ఆకట్టుకుంటున్నారు. అభిమానులంతా ఆమెను ముద్దుగా ఐష్ అని పిలుచుకుంటారు. తాజాగా, ఐశ్వర్యరాయ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించారు. ప్రస్తుతం నెట్టింట వీటికి సంబంధించిన ఫోటోలు కాస్త వైరల్‌గా మారుతున్నాయి. ఆమె చేతికున్న గాయాన్ని చూసిన అభిమానులు, నెటిజన్లు ఐష్‌కు ఏమయిందని తెగ టెన్షన్ పడిపోతున్నారు.
ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ వేదికగా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇక, భారత్ నుంచి కూడా పలువురు నటులు కూడా ఈ ఈవెంట్‌లో తళుక్కుమన్నారు. దీంతో ఆ వేడుకపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ కేన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో తన కుమార్తె ఆరాధ్యతో కలిసి బయలుదేరింది. అయితే ఆమె తన చేతికి ఒక బ్యాండేజ్ ధరించి కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు కాస్త ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

కేన్స్ ఫెస్టివల్‌కు కూడా ఐష్ అలాగే, చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించింది. దీంతో ఐష్ చేతికి అయిన గాయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు. అసలు ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ ఫోటోలు చూసిన చాలామంది ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐష్ గెట్వెల్ సూన్ అని కొందరు కామెంట్లు పెడితే, మరికొందరేమో గాయంతో కూడా కేన్స్‌కు హాజరయిన ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఏదిఏమైనా ఐశ్వర్యరాయ్ చేతి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం..












Click it and Unblock the Notifications