పెళ్లికి ముందే శృంగారం..ఓపెన్ అయిన ఐశ్వర్య రాయ్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే బాలీవుడ్‌లో ఒకటి వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో శృంగారంపై బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళ్తే..ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది.

విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది. 1997లో మణిరత్నం దర్శకత్వంలో తమిళలో ఇరువర్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు ఐశ్వర్య. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేశారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె.
ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆమె గతంలో ఓ ఇంటర్య్వూలో పెళ్లికి ముందు శృంగారంపై గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం అనేది వారికి సంబంధించి ఉంటుంది. అయితే నా వరకు వస్తే.. పెళ్లికి ముందు ఇలాంటి చర్యలు మంచివి కావు.పెళ్లికి ముందు అలా చేయకూడదని నేను భావిస్తున్నానంటూ ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది.












Click it and Unblock the Notifications