పెళ్లి కంటే సహజీవనం బెస్ట్: మెగా హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి పుకార్లు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. అలా ఏదోవిధంగా ప్రజల్లో చర్చగా ఉండాలని నటీనటులు కోరుకుంటారు. ఇక హీరోయిన్లు ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉంటారు. అలా తమ ఫ్యాన్స్ , ఫాలోవర్స్ కు ఎప్పుడూ టచ్ లో ఉంటారు. ఇక హీరోయిన్ పెళ్లి గురించి ఎప్పుడూ నెట్టింట వార్తలు వస్తూనే ఉంటాయి. గతంలో అనుష్క, త్రిషల పెళ్లి గురించి అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో కన్నడ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి పెళ్లి విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారు.

పెళ్లి అనేది జీవితంలో తప్పనిసరి కాదు. లైఫ్ లో తోడు కావాలంటే సహజీవనం కూడా ఓ మంచి ఎంపిక. నా 30 ఏళ్ల కెరీర్ లో.. పెళ్లి చేసుకున్న ఎంతో మంది జంటలను చూశాను. వారిలో సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువే. అంతేకాదు పెళ్లి తర్వాత కెరీర్ పైనా ప్రభావం పడే అవకాశాలు చాలానే ఉన్నాయి.. అంటూ కన్నడ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఈ 34 ఏళ్ల వయసున్న అమ్మడు, తనకు పెళ్లి పట్ల అస్సలు ఆసక్తి లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు.

అయితే గతంలో తాను కూడా పెళ్లి చేసుకోవాలని కలలు కన్నానని.. ఈ మేరకు తన ఫ్రొఫైల్‌ ను మ్యాట్రిమోనీ వెబ్ ‌సైట్‌ లోనూ పెట్టినట్లు ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చారు. అయితే తన ఫోటో చూసి అంతా ఫేక్‌ ప్రొఫెల్‌ అనుకున్నారని.. అదే సమయంలో తనకు ఇక పెళ్లి వ్యవస్థపై నమ్మకం పోయిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

AishwaryaLekshmi Marriage is Not a Necessity Living Together is Fine Too Aishwarya Lekshmi marriage

ఇక ఐశ్వర్య లక్ష్మి సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ఆమె గతంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె 2017లో 'నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా' సినిమాతో తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు రోహిత్ కేపీ దర్శకత్వంలో వస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమాలో సాయి ధరమ్‌ తేజ్‌ కు జోడీగా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+