Akhanda 2: థియేటర్ల పరిస్థితి ఏంటో..!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే బ్లాక్ బస్టర్ అని ఇప్పటికే రుజువైంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు బాక్సాఫీస్ ను ఊపేశాయి. అంతేకాక బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక అఖండ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న అఖండ 2: తాండవంపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గతంలో రిలీజైన ఓ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
బ్లాస్టింగ్ రోర్ పేరుతో రిలీజైన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. బాలయ్య డైలాగ్స్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో అంటూ బాలయ్య.. విలన్స్ కు ఇచ్చే వార్నింగ్ ఫ్యాన్స్ కు ఆకట్టుకుంటోంది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్ గా నిలవనుంది. బాలయ్య మాస్ డైలాగ్స్ , తమన్ బ్యక్ గ్రౌండ్ స్కోర్ కు థియేటర్ల పరిస్థితి ఏంటో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్ లో తమన్ మేజిక్ కనిపిస్తోంది. అఖండ 2: తాండవం బాలయ్య కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

2021లో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటించారు. అఖండ, మురళీ కృష్ణ.. అయితే ఈ మూవీలోనూ ఆ రెండు పాత్రలు అలాగే ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా మురళీ కృష్ణ క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఇక డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్దం అవుతోంది.
అఖండ 2: తాండవం మూవీని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాలయ్య తమన్ కాంబోలో ఇప్పటికే వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఇచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ కానుంది.












Click it and Unblock the Notifications