శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకిరా నందన్ ఎంట్రీ..? పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ ను చూస్తే హాలీవుడ్ హీరోకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటాడు. ఆ కటౌట్ అలా ఉంటుంది. అందుకే అకీరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా..? అని పవన్, మెగా ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమాని కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. అయితే అకిరా నందన్ ఎంట్రీ ఫలానా దర్శకుడితో అంటూ రోజుకో కథనం వెలువడుతుంది. తాజాగా ఆ లిస్టులోకి క్లాసిక్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల చేరారు. అవును శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అకిరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే అకిరా నందన్ ఇప్పటికే మ్యూజిక్ నేర్చుకుంటున్నాడని.. ఇప్పటికే ఓ షార్ట్ ఫిల్మ్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడని.. అలాగే తమన్ దగ్గర కూడా పనిచేశాడన్న విషయం తెలిసిందే. దీంతో అకిరా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని పలువురు భావిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం అకిరా హీరో అవుతాడని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో అకిరా హీరోగా చేస్తాడంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ఈ వార్త టాలీవుడ్ లో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక అకిరా నందన్.. తన తొలి సినిమా మాస్ హీరోలా కాకుండా క్లాస్ హీరోలా ఎంట్రీ ఇస్తాడని సమాచారం. క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనే అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త అప్ సెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాదిరి మాస్ మూవీతో ఎంట్రీ ఉంటుందని ఆశపడిన ఫ్యాన్స్ కు ఇది కాస్త అప్ సెట్ గానే అనిపిస్తుంది. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తే తాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అని పవన్ స్నేహితుడు, నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కూడా చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications