నాగార్జున ఇంటి కోడలుగా మరో హీరోయిన్..!!
అక్కినేని నాగార్జున ఇంట మరో పెళ్లి జరగనుందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అతి త్వరలోనే అక్కినేని ఇంట్లో మరో పెళ్లి జరగనుంది. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున వెల్లడించారు. ముంబై నటి జైనాబ్ రవద్జీని అఖిల్ అక్కినేని మంగళవారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
నాగార్జున తన ట్వీట్‌లో స్పందిస్తూ.. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. దయచేసి యువ జంటను అభినందించడానికి మాతో చేరండి మరియు వారి జీవితకాలం ప్రేమ, ఆనందం మరియు మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో నిండి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు.

ఈక్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చెప్పడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయని తెలుస్తోంది. అటు నాగార్జున సైతం అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అఖిల్ పెళ్లి వచ్చే ఏడాదిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8, to our daughter in law to be Zainab Ravdjee!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 26, 2024
We couldn't be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and… pic.twitter.com/5KM7BU00bz
ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమానే యావరేజ్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications