నువ్వే ఓ ఫ్లాప్ హీరో..మళ్లీ ఫ్లాప్ హీరోయిన్ ఎందుకు..?

అక్కినేని అఖిల్ కెరీర్ ప్రస్తుతం ఒడిదొడుకులతో సాగుతోంది. తెలుగు సినిమాకు పెద్ద దిక్కు అయిన అక్కినేని నాగార్జున కుమారుడిగా, అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, అలాగే నాగ చైతన్య అన్నగా సినీ నేపథ్యం బలంగా ఉన్నప్పటికీ, అఖిల్ తనకంటూ ఒక బలమైన స్టార్‌డమ్‌ను ఇంకా సంపాదించుకోలేకపోయారు.

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా 'అఖిల్'. వి. వి. వినాయక్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇది ఆయనకు ఒక బలమైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయింది.

ఇక అఖిల్ నటించిన రెండో సినిమా 'హలో'. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, నిర్మాతకు మాత్రం నష్టాలను మిగిల్చింది. అఖిల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Akkineni Akhil Lenin has reportedly chose Bhagyashri Borse as the heroine for his film

మూడో సినిమా మిస్టర్ 'మజ్ను' సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. అఖిల్ స్టైల్, డ్యాన్సులు బాగున్నప్పటికీ, కథ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఫలితం లేకపోయింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ఇది అఖిల్‌కు కొంత ఊరటనిచ్చింది.

ఇక 'ఏజెంట్' సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఘోర పరాజయం పాలైంది. అఖిల్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుని, చాలా కష్టపడినప్పటికీ, సినిమా ఫలితం నిరాశపరిచింది.

'ఏజెంట్' తర్వాత అఖిల్ తన తదుపరి ప్రాజెక్టుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరైన కథ, దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఆయన నుంచి ఒక భారీ హిట్ ఆశిస్తున్నారు. అఖిల్ తన నటన, డ్యాన్సులు, ఫిజిక్ విషయంలో మంచి మార్కులు సంపాదించినప్పటికీ, సరైన కథలను ఎంచుకోవడంలో కొన్ని సార్లు తడబడ్డారు.దీనిలో భాగంగానే మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో 'లెనిన్' అనే సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో అఖిల్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరికి సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. బిజీ షెడ్యూల్ కారణంగా శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను హీరోయిన్‌గా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. 'మిస్టర్ బచ్చన్' సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. అయినప్పటికీ భాగ్యశ్రీ బోర్సే అందాలకు మంచి మార్కులే పడ్డాయి.

దీంతో వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటుంది. దీనిలో భాగంగానే అఖిల్ 'లెనిన్' సినిమాలో భాగ్యశ్రీ బోర్సేని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.అయితే భాగ్యశ్రీ బోర్సే ఎంపికపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అఖిల్ కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేదు. అలాంటి హీరో సినిమాలో మరో ఫ్లాప్ హీరోయిన్ పెడతారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే భాగ్యశ్రీ బోర్సే ఎంపికపై చిత్ర యూనిట్ ఇంకా ఎటువంటి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+