ఆ అమ్మాయితో డేటింగ్ స్వర్గమే: నాగచైతన్య
అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ఆడియన్స్ లో ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ రెండు హిట్లు, మూడు ఫ్లాపులు అన్నట్టుగా సాగుతోంది. సమంతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత నుంచి నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నాడని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వివాహం కూడా చేసుకోబుతున్నారంటూ వార్తలు వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి.
వీళ్లిద్దరు కలిసి టూర్స్ కి వెళ్లడం, ప్రైవేట్ పార్టీలకు వెళ్లడం వంటివి సోషల్ మీడియా లో అభిమానులు చూస్తున్నారు. పెళ్లి ఎప్పుడు? అని సోషల్ మీడియా లో నాగ చైతన్య ని అక్కినేని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇటీవలే దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్యను యాంకర్.. మీరు శోభిత తో చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నారు కదా అని అడగగా, దానికి నాగ చైతన్య సమాధానం చెప్పారు. రాసేవాళ్ళని మనం ఆపలేము, రాసుకోమని చెప్పండి ఎన్నైనా, నేను ఆ అమ్మాయితోనే ఉన్నాను అని అనుకోండి, ఎం అవుతుంది? ఇప్పుడు? మీ ఇష్టమొచ్చినట్టు రాయండి, నేనైతే నా వ్యక్తిగత జీవితం లో ఎంతో సంతోషం గా ఉన్నాను అని నాగచైతన్య స్పష్టం చేశాడు.

ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రం చేస్తున్నారు. చందు మొండేటి దీనికి దర్శకుడు. రెండు దేశాల మధ్య ఉన్న సముద్ర జలాలపై ఆధారపడిన మత్స్యకారుల జీవితాన్ని చిత్రంగా రూపొందించనున్నారు. వేరే దేశంలో ఇరుక్కుపోయిన స్నేహితులను, జాలర్లను రక్షించి సొంత దేశానికి తీసుకువచ్చే యువకుడిగా నాగచైతన్య నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇది తెరకెక్కుతోంది.












Click it and Unblock the Notifications