విడాకుల సమయంలో ఏం జరిగిందో వారికి తెలుసు: నాగచైతన్య
సమంత-నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కూడా వారిద్దరూ ఏది మాట్లాడినా మీడియాలోకానీ, సోషల్ మీడియాలోకానీ వెంటనే ట్రెండ్ అవుతోంది. అంతగా వారిద్దరికి సంబంధించిన విషయంపై నెటిజన్లు, అభిమానులు దృష్టిసారిస్తున్నారు. నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించి తరుచుగా ఏదో ఒక రూమర్ వ్యాపిస్తూనే ఉంది. ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు నాగచైతన్య.
సమంతతో వివాహం అవడానికి ముందు నాగచైతన్య వ్యక్తిగత జీవితం గురించి ప్రేక్షకులకు తెలియదు. ఎప్పుడైతే సమంత ను పెళ్లి చేసుకున్నాడో, ఎప్పుడైతే వీరిద్దరూ విడిపోయారో అప్పటి నుంచి అడుగు తీసి అడుగు వేసినా వార్త అవుతోంది. విడాకులైన తర్వాత కూడా ఎక్కడైనా, ఎవరైనా ఆ విషయం గురించి అడిగితే స్పందించడంలో ఎటువంటి మొహమాటానికి నాగచైతన్య గురవలేదు. తాజాగా మరోసారి దీనిపై స్పందించాడు.

తన వ్యక్తిగత జీవితంపై అందరూ ఫోకస్ పెట్టడం ఇబ్బంది కలిగించడంలేదని, కాకపోతే తనను వర్క్ పరంగా గుర్తుపెట్టుకుంటే తాను ఇంకా సంతోషిస్తానన్నాడు. ఒక పాయింట్ తర్వాత దాని గురించి తాను అసలు పట్టించుకోనని, తనతో చనువుగా ఉండే మనుషులకు తనగురించి నిజాలు తెలుసన్నారు. ఆ విషయం పక్కన పెట్టి.. తన వ్యక్తిగత జీవితంద్వారా అందరికీ తెలియడం కంటే వర్క్ పరంగా, యాక్టర్‌గా అందరికీ తెలిస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను అన్నాడు. అందుకే తాను పనిపైనే దృష్టిపెట్టాలనుకుంటున్నానని, తనకన్నా ఇకనుంచి తన సినిమాలే మాట్లాడతాయన్నారు. సినిమాలు చాలా గొప్పగా ఉండి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తే వాటిద్వారానే తనను గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించాడు.












Click it and Unblock the Notifications