బంధువులమ్మాయితో రెండో పెళ్లి.. నాగచైతన్యనకు నచ్చచెబుతున్న నాగార్జున?
తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగచైతన్య - సమంత ముచ్చటైన జంట. ఈ విషయాన్ని సినీ ప్రియులంతా ఒప్పుకుంటారు. కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఈ జంటకు అక్కినేని నాగార్జున దగ్గరుండి మరీ వివాహం జరిపించారు. ఆ తర్వాత కొన్నేళ్లకే వీరిద్దరూ విడిపోయారు. అయితే ఎప్పటికైనా నాగచైతన్య-సమంత కలవకపోతారా? అనే ఆశతో అభిమానులంతా ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తికాదు. విడిపోవడం అనేది నాగచైతన్య, సమంతకన్నా అభిమానులే ఎక్కువగా బాధపడ్డారు.
విడాకుల తీసుకున్న తర్వాత నుంచి నాగచైతన్య ఒంటరిగానే ఉంటున్నారు. అయితే కొడుక్కి మళ్లీ రెండోపెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు. తమ బంధువుల్లోనే ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లిచేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు.

సినిమాలపై పూర్తిగా కాన్ సన్ ట్రేషన్ చేసివున్న సమయంలో తండ్రి పెళ్లి ప్రస్తావన తీసుకురావడం అనేది నాగచైతన్యకు ఎటూ పాలుపోని అంశంగా మారిందంటున్నారు. సాలిడ్ హిట్ కొడితే పరిశ్రమలో వాల్యూ పెరగడమే కాకుండా మార్కెట్ కూడా పెరుగుతుందనే ఆలోచనలో నాగచైతన్య ఉన్నారు. అయితే మరోవైపు నాగార్జున మాత్రం ఈ ఏడాది చివరకు, లేదంటే వచ్చే ఏడాది మొదట్లో పెళ్లి చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో కొడుకు అఖిల్ కు ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత అది క్యాన్సిల్ అయింది. నాగచైతన్య-సమంత విడిపోవడం, అఖిల్ పెళ్లి రద్దవడం.. అనే రెండంశాలు నాగార్జునను తీవ్రంగా బాధిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఒకరికైనా పెళ్లి జరిగితే కుటుంబం కుదుటపడుతుందని ఆయన భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications