నాగచైతన్య రెండో పెళ్లి... పెళ్లికూతురు ఎవరంటే
అక్కినేని నాగచైతన్య - సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాలకే ఇద్దరూ విభేదాలవల్ల విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకొని రెండు సంవత్సరాలవుతోంది. అయితే వీరిద్దరి విషయంలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి.. వైరల్ గా మారుతున్నాయి.
శోభితా ధూళిపాళ్లతో నాగచైతన్య రిలేషన్ లో ఉన్నాడంటూ ఏడాది కాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. విదేశాల్లో డేటింగ్ చేస్తూ కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వీటిపై నాగచైతన్య స్పందించలేదు. శోభితా మాత్రం అందులో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టిపెడుతున్న చై గురించి నాగార్జున చాలా లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు సమాచారం. సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేని వ్యాపారవేత్త కుమార్తెను కోడలిగా చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఒకసారి ప్రేమ వివాహం చేసుకొని దెబ్బతిన్న చై ఈసారి తండ్రి మాటకు తలవంచి రెండో పెళ్లికి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. చైతన్య రెండో పెళ్లి విషయం బాలీవుడ్ మీడియాలో కూడా వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతో తెలియాలంటే నాగార్జునకానీ, నాగచైతన్యకానీ స్పందించాల్సి ఉంది. అయితే మరోవైపు అభిమానులు చైకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మరోవైపు సమంత మయోసైటిస్ తో బాధపడుతోంది. చికిత్స కోసం ఏడాది కాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆమె తాజా చిత్రం ఖుషి విడుదలై మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతకుముందు విడుదలైన శాకుంతలం డిజాస్టర్ గా నిలిచింది.












Click it and Unblock the Notifications