పెళ్లికి ముందు నాగచైతన్యను బెదిరించిన సమంత?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన రెండో సినిమా ఏ మాయ చేశావే సినిమాలో మొదటిసారి సమంతతో కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ప్రేమించుకున్న తర్వాత 2017లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. నాలుగు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత 2021లో విడిపోయి అభిమానులను, సినీ పరిశ్రమను షాక్ కు గురిచేశారు. కొన్నాళ్ల తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళను ప్రేమించారు. పెద్దల అంగీకారంతో గత డిసెంబరు నెలలో వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియోలో 300 మంది అతిథుల మధ్య నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పరిశ్రమలో మంచి జంటగా కొనసాగుతున్నారు.

తాను కాస్త వెనకాడానన్న నాగచైతన్య
సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సహజం. అయితే నాగచైతన్య-సమంత విడిపోవడం మాత్రం అత్యంత సంచలనం కలిగించింది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యకు సంబంధించిన పాత వీడియో ఒకటి వైరలవుతోంది. ఆ ఇంటర్వ్యూ సమంతను పెళ్లిచేసుకోవడానికి ముందు జరిగింది. ప్రస్తుతం ఎవరో నెటిజన్లు దీన్ని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియోలో సమంత ఒక విషయంలో తనను బెదిరించినట్లు నాగచైతన్య చెప్పాడు. తామిద్దరం ప్రేమించుకున్నామని, ప్రేమలో ఉన్నామనే విషయాన్ని ఇంట్లో చెప్పడంలో ఆలస్యం చేస్తున్నందుకు సమంత బెదిరించిందని, ఇలా అయితే తాను వెంటనే రాఖీ కట్టేస్తానందని చెబుతాడు. తమ ప్రేమను ఇంట్లో చెప్పడానికి తాను కొస్త వెనుకాడానని, అందుకే ఆలస్యమైందని చెప్పాడు.

akkineni nagachaitanya shocking comments on samantha

హైదరాబాద్ రావడం మానేసిన సమంత
ప్రస్తుతం ఈ వార్త వైరలవుతుండటంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరూ విడిపోకుండా ఉంటే బాగుండేదని, చూడముచ్చటైన జంట అని, అనవసరంగా విడిపోయారంటున్నారు. వీరు విడిపోవడం అక్కినేని అభిమానులను కూడా ఎంతో బాధించింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ కు చికిత్స తీసుకొని ముంబయిలో ఉంటోంది. రెండు వెబ్ సిరీస్ లు చేస్తోంది. హైదరాబాద్ రావడం తగ్గించేసింది. సినిమాల్లో అవకాశాలు రావడంలేదని పబ్లిక్ గానే చెప్పేసింది. రెండు సంవత్సరాలు విరామం తీసుకోవడం మైనస్ అని అభిప్రాయపడింది. క్రమేపీ హైదరాబాద్ రాదని, చివరకు ముంబయిలోనే స్థిరపడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సమంత జీవితం భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+