గర్వపడుతున్నా.. తండేల్ సక్సెస్‌పై నాగార్జున ఎమోషనల్ పోస్ట్
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన తండేల్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్య నటన అదిరిపోయిందని ప్రేక్షకులు చెబుతున్నారు. దేశభక్తి ఎలిమెంట్స్‌తో అందమైన ప్రేమకథను చూపించారని అంటున్నారు.
ఈ క్రమంలోనే తండేల్ మూవీ హిట్ కావడంపై అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాగ చైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు. తండేల్ సినిమా విజయం సాధించడంపై చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు.

ఈ మేరకు ఆ పోస్టులో.. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశాను. తండేల్ సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం అని నాగ చైతన్యను మెచ్చకున్నారు. అక్కినేని అభిమానులు అంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఫ్యాన్స్ ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు అని చెప్పారు. అలానే సాయి పల్లవిపై కూడా ప్రశంసలు కురిపించారు. దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి, 'తండేల్' టీమ్‌కు, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసుకు కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారు. ప్రస్థుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరూ పోటీపడి మరీ నటించారని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, చివరి 20 నిమిషాల సినిమాను దర్శకుడు మరో లెవెల్‌కు తీసుకువెళ్లారని చెబుతున్నారు. క్లైమాక్స్‌లో నాగ చైతన్య నటన అందర్నీ కత్తిపడేసిందని కితాబు ఇస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Dear @chay_akkineni, Proud of you my son!❤️ I have watched you push boundaries, face challenges, and give your heart to the craft. Thandel is not just another film—it is a testament to your relentless passion, your courage to dream big, and your hard work. 💐 ✨ ✨ ❤️
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 9, 2025
To all… pic.twitter.com/cE9u2EKaTn
మరోవైపు కలెక్షన్లలో కూడా తండేల్ సినిమా సత్తా చాటుతోంది. ఈ మూవీకి తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మేరకు బ్లాక్ బస్టర్ లవ్ సునామీ అంటూ మూవీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఇక వీకెండ్ కలెక్షన్స్ కూడా కలిసి ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ యాంట్హయ ఫుల్ ఖుషి అవుతున్నారు.












Click it and Unblock the Notifications