సరిగ్గా 7 రోజుల్లో బ్లాస్టింగ్ రికార్డ్ కొట్టిన నాగార్జున
సంక్రాంతికి బరిలోకి దిగితే కచ్చితంగా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని మన్మథుడు అక్కినేని నాగార్జున మరోసారి నిరూపించారు. అన్ని సెంటర్లలో యునానిమస్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకుంది. తర్వాత నుంచి రాబోయే కలెక్షన్లీ బయ్యర్లకు లాభాలపంట పండించనున్నాయి. నైజాంలో ఈరోజుతో బ్రేక్ ఈవెన్ పూర్తికానుంది. ఆంధ్రాలోని అన్ని కేంద్రాల్లో లాభాల్లోకి ప్రవేశించింది. ఏడురోజుల్లో రూ.41.3 కోట్లను కలెక్ట్ చేసి దిగ్విజయంగా రెండో వారంలోకి ప్రవేశించింది.
ఈనెల 25వ తేదీ వరకు విడుదలయ్యే సినిమాలేవీ లేవుకాబట్టి నా సామిరంగ ఫైనల్ కలెక్షన్స్ తో బయ్యర్స్ కి భారీగా డబ్బులు మిగలనున్నాయి. హనుమాన్ తర్వాత సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఈ సినిమా రెండో క్లీన్ హిట్ గా నిలిచింది. నా సామిరంగ చిత్రం అక్కినేని అభిమానుల్లో భారీ జోష్ ను నింపింది. సంక్రాంతికి కింగ్ బరిలోకి దిగితే కచ్చితంగా తాము హిట్ కొడతామని అభిమానులు అంటున్నారు.

ఇకనుంచి రాబోయే సంక్రాంతి సీజన్లలో నాగ్ నిలబడ్డాడు అంటే.. హిట్ కొడుతున్నాడు అని రాసుకోవాలంటున్నారు. మజ్ను సినిమా నుంచి బంగార్రాజు వరకు సంక్రాంతి బరిలోకి వచ్చిన ఏ నాగార్జున సినిమా ఫ్లాప్ అవలేదు. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, నా సామిరంగ సినిమాలతో నాగార్జున హ్యాట్రిక్ సంక్రాంతి హిట్స్ అందుకోవడమేకాదు.. ఈ జోష్ లోనే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు పార్ట్ 3 వస్తుందని ప్రకటించేశాడు.

అంటే 2025 సంక్రాంతికి కూడా తాను బరిలోకి వస్తున్నట్లు ట్రేడ్ పండితులకు ముందే చెప్పేసినట్లైంది. వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ చిత్రం, చిరంజీవి విశ్వంభర కూడా రానున్నాయి. దీంతో అగ్రహీరోల మధ్య భారీస్థాయిలో సంక్రాంతి పోరు జరగబోతున్నట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications