అంబానీ పెళ్లిలో కలకలం..స్టార్ హీరోకు కరోనా
ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం శుక్రవారం అట్టహాసంగా జరగనున్నది. మరికాసేపట్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ లు వివాహం బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. అంబానీ ఇంట మూడురోజులపాటు పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివస్తున్నారు. ముంబయిలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి.దాదాపుగా 2500 మంది ముఖ్యఅతిథులుగా వస్తున్నారు.
టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన తారలు ఈ పెళ్లి వేడుకల్లో హాజరు అవుతున్నారు. షారుక్, సల్మాన్ వంటి స్టార్ హీరోలు సైతం అంబానీ పెళ్లిలో సందడి చేయడానికి సిద్దమవుతున్నారు. అయితే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాత్రం అంబానీ ఇంట జరిగే పెళ్లికి దూరంగా ఉన్నారు. ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. అక్షయ్ కుమార్ తాజాగా నటించిన 'సర్ఫిరా' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలోనే ఆయనకు కరోనా సోకిందని తెలుస్తోంది.

ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించుకోగా కరోపా పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు సూచనలు పాటిస్తూ అక్షయ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో అంబానీ ఇంట జరిగే పెళ్లిని అక్షయ్ మిస్ అవుతున్నారు. ఇక అక్షయ్ కుమార్ నటించిన 'సర్ఫిరా' శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు బాలీవుడ్ జనాల నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా నమోదయ్యాయి. దీంతో 'సర్ఫిరా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్












Click it and Unblock the Notifications