రణ్ బీర్ పై షాకింగ్ కామెంట్స్.. విడాకులపై హింట్ ఇచ్చిన అలియా..!
ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్, వారి వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సినిమాల్లో నటించేటప్పుడు స్టార్స్ పై ఎఫైర్స్ సాధారణంగా వస్తుంటాయి. అలాంటి వాటి గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్, సగటు సినీ అభిమాని తహతహలాడుతుంటారు. ఇక బాలీవుడ్ స్టార్ కపుల్స్ లో రణ్ బీర్ కపూర్, అలియా భట్ ఎంతో అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరి వివాహం ఏప్రిల్, 2022లో జరిగింది. అదే ఏడాది నవంబర్ లో అలియా రహాకు జన్మనిచ్చింది. అయితే ఇటీవల జరిగిన ఓ చాట్ షోలో అలియా భట్ తన భర్త రణ్ బీర్ కపూర్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
తన లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రోలింగ్ చేసేది రణ్ బీర్ అని అలియా ఓపెన్ అయింది. తనది, రణ్ బీర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్ షిప్ అని పేర్కొంది. అతడు నాకు హ్యూమన్ బీయింగ్ గా అద్భుతంగా కనిపించాడు. అందుకే పెళ్లి చేసుకున్నా. అతడికి నన్ను ట్రోలింగ్ చేయడమంటే ఇష్టం. అతడి ట్రోలింగ్ ను 100 శాతం ఇష్టపడతాను.. అని తెలిపింది. అలాగే పెళ్లి విషయంలో మర్యాద అనేది గొప్ప విషయం అని పేర్కొంది. మర్యాదతోనే ఆ తర్వాత అన్నీ వస్తాయి. అది సపోర్ట్ అయినా లవ్ అయినా. నాకు మ్యారేజ్ లో రెస్పెక్ట్ అన్నింటికంటే ముఖ్యమైన అంశం.. అని అలియా భట్ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఏ ఉద్దేశంతో రణ్ బీర్ పై అలియా ఈ వ్యాఖ్యలు చేసిందని నెట్టింట చర్చ మొదలైంది. ఇటీవల ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులంటూ నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే.

అలాగే తమ పెళ్లి గ్రాండ్ గా కాకుండా.. అత్యంత ముఖ్యమైన బంధువుల మధ్య జరగడంపైనా స్పందించింది. తమ వెడ్డింగ్ అలాగే జరగాలని కోరుకున్నామని తెలిపింది. ఇక సినిమాల విషయానికి వస్తే రణ్ బీర్ కపూర్ ప్రస్తుతం రామాయణ పార్ట్ 1 సినిమా చేస్తున్నారు. ఈ మూవీలో శ్రీరాముడిగా రణ్ బీర్ కనువిందు చేయనున్నాడు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తోంది. ఇక రావణాసురుడిగా యశ్ నటిస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది. అలాగే రణ్ బీర్ కపూర్ యానిమల్ పార్క్ మూవీలోనూ నటిస్తున్నాడు. ఇక అలియా భట్ వైఆర్ఎఫ్ యూనివర్స్ లోని ఆల్ఫా చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 2025లో రిలీజ్ కానుంది.












Click it and Unblock the Notifications