పట్టాలెక్కనున్న వెంకీ - త్రివిక్రమ్ మూవీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?
టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. రీసెంట్ గానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా రిలీజ్ అయ్యి భారీ హిట్ అందుకుంది. రీజనల్ ఫిల్మ్ గానే వచ్చి ఏకంగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఆ మూవీ. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాడు వెంకీ. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. దీంతో మళ్లీ సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు.
అయితే సినీ వర్గాల్లో నడుస్తున్న డిస్కషన్ ప్రకారం.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకటేశ్ సినిమా చేయబోతున్నారని అంటున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందించారు. ఆ చిత్రాలు బ్లాక్ బాస్టర్స్ గా నిలిచాయి. దాంతో వీరి కాంబినేషన్ లో మళ్లీ ఎప్పుడూ మూవీ ఉంటుందా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మాత్రం ఓ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉండగా.. స్క్రిప్ట్ చాలా వరకు పూర్తి కాకపోవడంతో ముందుగా అట్లీ సినిమాని మొదలు పెట్టబోతున్నాడు బన్నీ. ఆ చిత్రం పూర్తి అయ్యే లోపు.. వెంకటేష్ తో సినిమా పూర్తి చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాడట మాటల మాంత్రికుడు. ఇప్పటికే వీళ్లిద్దరు రెండు మూడు సార్లు స్టోరీ సిట్టింగ్స్ కూడా వేశారని.. నువ్వు నాకు నచ్చావ్' లాంటి సబ్జెక్టు ని సిద్ధం చేశారని టాక్ నడుస్తోంది. ఒక ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టును రెడీ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ స్క్రిప్ట్ కూడా వెంకటేష్ కు నచ్చిందని దాంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జూన్ లో మొదలు పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాతో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలను తీరుస్తారని భావిస్తున్నారు. తనదైన డైలాగ్స్ తో త్రివిక్రమ్ రెచ్చిపోతే.. వెంకీ మామ యాక్టింగ్ తో కుమ్మేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని గురించి అధికార ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications