విజయ్ దేవరకొండతో రొమాన్స్‌కు సాయి పల్లవి రెడీ
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సాయి పల్లవి అసలు ఈ కాంబినేషన్ ఊహించుకోవడమే కష్టంగా ఉంది. కథ ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ సినిమాల్లో రొమాన్స్, లిప్ లాక్‌లు తప్పని సరిగా ఉండాల్సిందే. మరోవైపు సాయి పల్లవి విషయానికి వస్తే.. చేసింది తక్కువ సినిమాలే అయిన సాయి పల్లవి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి తన స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది వీరిద్దరు కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవ్వడం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాతో పాటు మరోవైపు దిల్ రాజు బ్యానర్‌లో సైతం విజయ్ దేవరకొండ మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక రూరల్ యాక్షన్ డ్రామా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో 'డియర్ కామ్రేడ్' మూవీ లో సాయి పల్లవి నటించాల్సి ఉండగా ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఆమె నో చెప్పింది దీంతో రష్మికతో ఆ ప్రాజెక్టు ఫినిష్ చేశారు మేకర్స్. అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పుడు ఫిక్స్ అయ్యేలా కనిపిస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
అల్లు అర్జున్‌కు బాగా ఇష్టమైన మహేష్‌బాబు సినిమా -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ












Click it and Unblock the Notifications