'హరిహర వీరమల్లు' ట్రైలర్..ఈ మిస్టేక్స్ గమనించారా..?
పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న 'హరిహర వీరమల్లు' ట్రైలర్‌లో ఒక సన్నివేశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ చివరిలో పవన్ కళ్యాణ్ ఒక నక్కతో పోరాడే సన్నివేశం హైలైట్‌గా నిలిచినప్పటికీ, ఇది రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'RRR' చిత్రంలోని ఎన్టీఆర్ - పులి పోరాట సన్నివేశాన్ని కాపీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
'RRR' స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ పులితో తలపడే క్లోజ్-అప్ సన్నివేశం సినిమాకే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు 'హరిహర వీరమల్లు'లో నక్కతో పవన్ పోరాడే సన్నివేశం దాదాపు అదే తరహాలో ఉండటంతో, పవన్ అభిమానుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "ఈ షాట్ తప్ప ఇంకోటి దొరకలేదా? 'RRR' చూసి ఎందుకు కాపీ కొట్టారు?" అంటూ డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుంది. "ఒరిజినల్ కంటెంట్, బౌండెడ్ స్క్రిప్టు ఉన్న డైరెక్టర్ క్రిష్‌కు కూడా గుర్తింపు లభించలేదు. కానీ కాపీ రైట్స్ ఇష్యూస్ ఉన్న ఆ దర్శకుడికి మాత్రం అంత గుర్తింపు ఇస్తున్నారు" అంటూ ఆమె చేసిన ట్వీట్, ట్రైలర్‌లోని ఈ 'కాపీ' అంశానికి బలాన్ని చేకూర్చింది. అయితే, ట్వీట్ చేసిన కొద్దిసేపటికే పూనమ్ దానిని డిలీట్ చేయడం గమనార్హం. ఈ సంఘటన 'హరిహర వీరమల్లు'పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.












Click it and Unblock the Notifications