జూనియర్ ఎన్టీఆర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అల్లు అర్జున్ - త్రివిక్రమ్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి సంయుక్తంగా ఎన్టీఆర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తనకు ఫ్లాప్ ఎదురై ఎవరూ సినిమా చేయడానికి ముందుకు రాని పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో కలిసి అరవింద సమేత సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత ఇంతవరకు వీరి కాంబోలో సినిమా రాలేదు. త్రివిక్రమ్ ఎప్పుడూ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ తన ఆత్మ బంధువులైట్లు వారితోనే సినిమా తీయడానికి ఎదురుచూస్తుంటారు.

అయితే మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం అడ్రస్ లేకుండా పోవడానికి కూడా త్రివిక్రమే కారణం. ఫ్లాప్ లు ఎదురైనప్పుడు వేరే హీరోలు సినిమాలు చేయడానికి అవకాశం ఇవ్వాలికానీ హిట్లు తీస్తుంటే అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ కావాలి. ఇదేం సూత్రమో, ఏ పుస్తకంలో ఉందో, ఏ పురాణాల్లో ఉందో, ఏ విదేశీ సినిమాల్లో ఉందో త్రివిక్రమ్ కే తెలియాలి.

Allu Arjun and Trivikram gave Junior NTR a shocking surprise

నెల్సన్ దిలీప్ కుమార్ తో రద్దు చేసుకొని..
ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అల్లు అర్జున్ తో చేయాల్సిన సినిమా వాయిదా పడింది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కన్నా అట్లీతో సినిమా చేసేందుకే మొగ్గుచూపాడు. దీంతో త్రివిక్రమ్ కు భారీ షాక్ తగిలింది. ఏం చేయాలో తెలియక మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ నే ఆశ్రయించాడు.

సరే అన్న ఎన్టీఆర్ తో బన్నీతో అనుకున్న సబ్జెక్టును చేసేందుకు స్క్రిప్ట్ అంతా సిద్ధం చేశాడు. వాస్తవానికి త్రివిక్రమ్ తో చేయాల్సిన సమయంలోనే నెల్సన్ దిలీప్ కుమార్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే త్రివిక్రమ్ సినిమా కోసం దిలీప్ కుమార్ సినిమాను ఎన్టీఆర్ వదులుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

త్రివిక్రమ్ కే వదిలేసిన అభిమానులు
ఇది చాల అన్యాయమంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. త్రివిక్రమ్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. అల్లు అర్జున్ అట్లీ సినిమా అవగానే రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందులో త్రివిక్రమ్ తో ఒకటి, పుష్ప3 ఒకటి. ఉన్నట్లుండి హఠాత్తుగా త్రివిక్రమ్-అల్లు అర్జున్ మధ్య ఎలా సయోధ్య కుదిరిందో ఎవరికీ అర్థం కాలేదు. సబ్జెక్ట్ విభిన్నంగా ఉండటం, మైథలాజికల్ టచ్ ఉండటం, భారీ బడ్జెట్ సినిమా కావడం, తనకు కూడా విభిన్నంగా ఉంటుందని బన్నీ భావించడంతో ఇటు మొగ్గుచూపాడు.

దీంతో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను దూరం పెట్టి బన్నీతో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు. అయితే ఒక దర్శకుడిగా కాకుండా ఒక మనిషిగా ఇది ఎంతవరకు సరైన నిర్ణయం అనేది త్రివిక్రమ్ ఆలోచించుకోవాలంటున్నారు తారక్ అభిమానులు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాల్లో భారీ భారీ డైలాగులుంటాయి విలువలకు సంబంధించి. అవి సినిమాల వరకే పరిమితమా? జీవితంలో కూడా తాను వాటిని పాటిస్తానని నిరూపించుకుంటాడా? అనేది అతనికే వదిలిపెడుతున్నామంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+