అల్లు అర్జున్‌కు ఘోర అవమానం..ఫస్ట్ మాస్క్ తీసి మాట్లాడంటూ...

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరో ఎవరంటే మెజార్టీ అభిమానులు అల్లు అర్జున్ పేరునే చెబుతారు.తనదైన శైలి, అద్భుతమైన డ్యాన్స్ స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అతి కొద్దిమంది నటులలో అల్లు అర్జున్ ఒకరు. చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చిన ఆయన, కేవలం డ్యాన్సర్‌గానే కాకుండా, అన్ని రకాల పాత్రలను పోషించగల ఒక పరిపూర్ణ నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు.

"గంగోత్రి"తో మొదలై, "ఆర్య", "బన్నీ", "డిజె" వంటి సినిమాలతో స్టైలిష్ స్టార్‌గా ఎదిగి, "పుష్ప"తో దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్‌గా అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఆయన ప్రతీ సినిమాలో కొత్తగా ఏదైనా చేయాలనే తపన, నిరంతరం తనను తాను మెరుగుపరుచుకోవాలనే ఆకాంక్షే ఈ రోజు ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇక 'పుష్ప-2' సినిమాతో అల్లు అర్జున్ చేసిన విధ్వంసం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.

Allu Arjun Asked to Remove Mask at Mumbai Airport Viral Video Sparks Debate

ప్రభాస్ నటించిన బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప-2 నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాడు అల్లు అర్జున్. షెడ్యూల్ షూటింగ్ పూర్తి కావడంతో తిరిగి ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ మాస్క్ పెట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు .

ఈ సందర్భంగా చెకింగ్ కౌంటర్ దగ్గర అల్లు అర్జున్ ను సదరు అధికారి గుర్తుపట్టలేదు. మాస్క్ తీయండని కోరారు. పక్కన ఉన్న వ్యక్తి ఇతను అల్లు అర్జున్ అని చెప్పడం కనిపించింది. అయినప్పటికీ ఆ అధికారి మాస్క్ తీయాల్సిందే అని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చేసేది లేక మాస్క్ తీసి తన ఫేస్‌ను సదరు అధికారికి చూపించి , తిరిగి మాస్క్ ధరించారు అల్లు అర్జున్. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై కొంతమంది నెటిజన్లు అల్లు అర్జున్ పరువు పోయిందని", ఆయనను ఎవరూ గుర్తించడం లేదని నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.అయితే, ఈ నెగెటివ్ పోస్టులకు అల్లు అర్జున్ అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ముఖానికి మాస్క్ ధరించి ఉంటే, ఎవరైనా సరే గుర్తుపట్టడం కష్టమని వారు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+