Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మామూలు ప్లాన్ కాదయ్యో లోకేష్.. అల్లు అర్జున్‌కి జోడీగా ప్రభాస్ హీరోయిన్ !

పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు "అల్లు అర్జున్". ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. #AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

అయితే అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ మూవీ ఉంటుందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్లిందని టాక్ వినిపించింది. కానీ మళ్లీ ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికే వచ్చిందని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మరో మూవీని అనౌన్స్ చేశారు బన్నీ. సంక్రాంతి కానుకగా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

allu-arjun-committed-new-movie-under-lokesh-kanagaraj-direction-and-shraddha-kapoor-going-to-act-in

కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కోసం ప్రభాస్ హీరోయిన్ ను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట లోకేష్.

ఇక ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా టార్గెట్ గా సినిమాలు చేస్తున్న విషయంలో తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతోందని.. ఆ లెక్కల మేరకే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ పేరుని పరిశీలిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రెండు ఏళ్ల క్రితం 'స్త్రీ 2' చిత్రంతో భారీ హిట్ అందుకోగా.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాలకి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

మరోవైపు ఈ మూవీ ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వకముందే.. సినిమా చరిత్రలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.55 మిలియన్లకు (35 లక్షలకు) పైగా వ్యూస్ వచ్చాయి. ఇండియాలో ఒక సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోకు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మరోవైపు లోకేష్- రజినీ కాంబినేషన్ లో వచ్చిన "కూలీ" ఫ్లాప్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+