కాంగ్రెస్ తరుఫున అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం..? వీడియో వైరల్
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అల్లు అర్జున్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదంటే అతిశేయోక్తి కాదు. అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు, కన్నడలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాతో ఇండియా మొత్తం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు గెలుచుకుని సత్తా చాటాడు. నేషనల్ అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఈ ఫ్యాన్ ఇండియా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలోస్తున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ రాజకీయాకు దూరంగా ఉన్నప్పటికీ .. రాజకీయాలు మాత్రం ఆయన్ను వదలడం లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున వైసీపీలో చేరారు. రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి చిన్నియాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అభిమానులు మంత్రి అమర్‌నాథ్ నివాసంలో వైసీపీలో చేరారు.

మెగా అభిమానులు సాధారణంగానే పవన్ పార్టీకి అండగా ఉంటున్నారు. కానీ అల్లు అర్జున్ అభిమానులు వైసీపీలో చేరి జగన్‌కు మద్దతుగా నిలిచారు. తాజాగా అల్లు అర్జున్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్ పక్కన ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు.
South Actor #AlluArjun campaigns for Congress party. #NoVoteToBJP #HaathBadlegaHalaat pic.twitter.com/F5iC9t6jjh
— 𝕶𝖆𝖓𝖍𝖆𝖎𝖞𝖆 𝖘𝖎𝖓𝖌𝖍 (@MrKanhaiyaSingh) April 21, 2024
దీంతో అల్లు అర్జున్ నిజంగానే కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేశారని అభిమానులు భావించారు. అయితే అల్లు అర్జున్ ఫొటోలు, వీడియోలను ఎడిట్ చేసి కాంగ్రెస్‌కు అనుకూలంగా వైరల్ చేశారనే తరువాత తెలిసింది. వాస్తవానికి అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరైయ్యారు. ఆ సమయంలో బన్ని జాతీయ జెండాతో ర్యాలీ చేశారు. అప్పటి ఫొటోలను, వీడియోను ఎడిట్ చేసి ఇలా కాంగ్రెస్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై బన్ని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications