మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోని వివాదాలు ఇప్పట్లో చల్లారేలా కనపడటంలేదు. నివురుగప్పిన నిప్పులా అప్పుడప్పుడు బయటకు పేలుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు.
దీనిపై మెగా సోదరుడు నాగబాబు ట్వీట్ చేశారు. ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయివాడే అవుతాడు.. పరాయివాడై ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు.. అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ గురించే చేశారంటూ వార్తలు వచ్చాయి. దీన్ని ఎవరూ ఖండించకపోవడంతో అనుమానాలు ఇంకా పెరిగాయి.

పంక్చర్లు వేసుకునేవాడివి
దీనికి కౌంటర్ గా అల్లు అర్జున్ ట్విటర్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ రెండు రోజుల నుంచి వైరల్ అవుతోంది. మా తాత లేకపోతే బాపట్లలో సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడివంటూ అందులో ఉంది. అయితే అది బన్నీ అకౌంట్ నుంచి వచ్చిందా? లేదంటే బన్నీ అభిమానులెవరైనా క్రియేట్ చేశారా? అనేదానిపై స్పష్టత రాలేదు. దీనిపై అల్లు అర్జున్ కూడా నాది కాదు అని చెప్పకపోవడంతో అనుమానాలు బలపడ్డాయి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు నాగబాబును ట్రోలింగ్ చేశారు.
ఎగ్జిట్ అయిన బన్నీ
తాజాగా మరోవార్త వైరలవుతోంది. మెగా కుటుంబంలోని హీరోలు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరికివారు వారి వారి సినిమాల గురించి, ఇతర విషయాల గురించి, వ్యక్తిగత విషయాల గురించి అందులో పోస్ట్ చేస్తుంటారు. అందరూ కమ్యూనికేట్ అవుతుంటారు. ఏమైనా ఫంక్షన్లు ఉన్నా అందులో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మెగా కుటుంబానికి, అల్లు కుటుంబానికి దూరం బాగా పెరిగిందంటున్నారు. అల్లు అరవింద్ మాత్రం అటూ చెప్పలేక, ఇటూ చెప్పలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications