Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుర్ర హీరోలకి ఇచ్చిన వాల్యూ "అల్లు అర్జున్" మంచు హీరోలకి ఇవ్వలేదుగా..?

తెలుగు చిత్రపరిశ్రమలో అల్లు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. హైదరాబాద్‌లోని కోకాపేటలో నిర్మించిన "అల్లు సినిమాస్" మల్టీప్లెక్స్ ఇటీవల ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ థియేటర్‌ను ప్రారంభించారు. ఈ మల్టీప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్లలో ఒకటి డాల్బీ సినిమా టెక్నాలజీతో ఉండటం ప్రత్యేకత. భారతదేశంలో ఇది మూడో డాల్బీ సినిమా స్క్రీన్ కాగా.. ప్రపంచంలో మూడవ అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ అని చెబుతున్నారు. అలాగే ఇది దేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమా స్క్రీన్‌ గా ప్రఖ్యాతి గాంచింది. అయితే ఇప్పుడు పూర్తిగా ఊహించిన కారణాల వల్ల ఈ థియేటర్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

కొద్దిరోజుల ముందు వరకు "వాల్ ఆఫ్ గ్రేట్స్" అంటూ ఏర్పాటు చేసిన భారత సినీ దర్శకుల ఫొటోల్లో.. ఎస్.ఎస్. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్, మణిరత్నం, వెట్రిమారన్, అట్లీ, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్, లిజో జోస్ పెల్లిస్సేరి, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ మరియు సందీప్ రెడ్డి వంగా ఉన్నారు. అయితే కొంతమంది ప్రభావవంతమైన చిత్ర దర్శకులు అందులో లేకపోవడం వివాదానికి కారణం అయింది. ఇక ఇప్పుడు ఆ థియేటర్ లోనే ఏర్పాటు చేసిన హీరోల పేరుల్లో కొన్ని మిస్ అవ్వడం చర్చకు తెరలేపింది.

allu-arjun-facing-trolling-about-missing-manchu-family-heros-names-in-heros-names-at-allu-theatre

హీరోల పేర్లు..

తెలుగు సినీ హీరోలు:

ఎన్‌.టి. రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, నాగార్జున, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, వెంకటేష్, నాగ చైతన్య, మోహన్ బాబు, జగపతి బాబు, నాని, విజయ్ దేవరకొండ, అడివి శేష్, రానా దగ్గుబాటి, సాయి ధరమ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, సుధీర్ బాబు, విశ్వక్సేన్, రామ్ పోతినేని, నవీన్ పొలిశెట్టి, సందీప్ కిషన్.

తమిళ సినీ హీరోలు:

రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్, ధనుష్, సూర్య, విక్రమ్, కార్తి, శివకార్తికేయన్, ప్రభుదేవా, సిలంబరాసన్.

మలయాళ సినీ హీరోలు:

మమ్ముట్టి, మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహాద్ ఫాసిల్, నివిన్ పౌలి, టోవినో థామస్, బాసిల్ జోసెఫ్, జోజు జార్జ్, నస్లెన్ గఫూర్, ఆసిఫ్ అలీ.

కన్నడ సినీ హీరోలు:

శివరాజ్ కుమార్, యష్, సుదీప్, ఉపేంద్ర, వి. రవిచంద్రన్, విష్ణువర్ధన్

హిందీ (బాలీవుడ్) హీరోలు:

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, సన్నీ డియోల్, ఫర్హాన్ అఖ్తర్, గోవింద, మాధవన్, కార్తిక్ ఆర్యన్.

allu-arjun-facing-trolling-about-missing-manchu-family-heros-names-in-heros-names-at-allu-theatre

కానీ వీరిలో మంచు మోహన్ బాబు కుమారులు మంచి విష్ణు, మంచు మనోజ్ పేర్లు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి, కిరణ్ అబ్బవరం వంటి వారు ఉన్న ఈ జాబితాలో మంచు హీరోలకి అల్లు అర్జున్ వాల్యూ ఇవ్వకపోవడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణుని పక్కన పెట్టినా కానీ.. మంచు మనోజ్ అల్లు అర్జున్ తో కలిసి వేదం సినిమా చేశారు. కనీసం ఆయన పేరు కూడా లేకపోవడం ఏంటంటూ మండిపడుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+