రామ్‌చరణ్ గేమ్‌ఛేంజర్‌పై అల్లు అర్జున్ తప్పుడు ప్రచారం?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీద ప్రస్తుతం నెగెటివిటీ ఎక్కువగా వ్యాపిస్తోంది. దీనికి కారణం మొన్న జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీచేసిన అతని స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే. సాధారణంగా ఇదే విషయమైతే ఎవరూ పట్టించుకునేవారు కాదుకానీ పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ కు ట్వీట్ ద్వారా మద్దతు ప్రకటించి అంతటితో సరిపెట్టాడు. స్నేహితుడి కోసం స్వయంగా నంద్యాల వెళ్లి మద్దతు తెలపడంతో మెగా అభిమానులు, పవన్ కల్యాణ్ అభిమానులు భగ్గుమన్నారు.
మెగాకు, బన్నీకి పెరిగిన దూరం
ఆ సంఘటన నుంచి మెగా కుటుంబ సభ్యులకు, అల్లు అర్జున్ కు మధ్య దూరం బాగా పెరిగిందని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అల్లు అర్జున్ నెగెటివ్ గా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన ఎవరి దగ్గర దీన్నిగురించి మాట్లాడారా? అసలు నిజంగా మాట్లాడారా? లేదంటే పుకార్లేనా? అనే విషయంపై స్పష్టతలేదు. అయితే మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు మాత్రం సామాజిక మాధ్యమాల్లో యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.

రామ్‌చరణ్‌పై బన్నీ తప్పుడు ప్రచారం?
అల్లు అర్జున్ తన దగ్గర ఉన్న సోషల్ మీడియా ఆర్మీద్వారా గేమ్ ఛేంజర్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. డబ్బులు వెదజల్లి మొదటి నుంచి సోషల్ మీడియాద్వారా ఇతర హీరోలపై నెగెటివిటీని వ్యాప్తిచేయడంలో బన్నీ ముందుండేవాడని, ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నాడంటూ మెగా అభిమానులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానుల ధాటికి తన సినిమా పుష్ప2ను వాయిదా వేసుకున్నాడని, డిసెంబరు ఆరున విడుదల చేసినా దీన్ని కచ్చితంగా ఫ్లాప్ చేస్తామంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరి గొడవ ఎటువంటి మలుపులు తీసుకోనుందో చూడాలి.












Click it and Unblock the Notifications