అల్లు అర్జున్ కు ఇష్టమైన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఐకాన్ స్టార్ గా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఇది విడుదల కాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప2 తో కూడా ఆగేది లేదని, దీన్ని ఒక ఫ్రాంఛైజీగా తీసుకురాబోతున్నట్లు అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రకటించాడు. ఆ ఫెస్టివల్ లో పాల్గొనడానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

పుష్ప సినిమా తెలుగులోకన్నా బాలీవుడ్ లోనే ఘనవిజయాన్ని సాధించింది. హిందీ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దర్శకుడు సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వస్తున్నాడు. పుష్ప2తో మరో సూపర్ హిట్ ఖాయం అనే అంచనాలో బన్నీ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అతను అభిమానులు సంపాదించుకున్నాడు. ఎంతోమంది బన్నీని ఇష్టపడుతున్నారు. అటువంటి బన్నీకి కూడా ఇష్టమైన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు.. బి్ బి అమితాబ్ బచ్చన్.

allu arjun favourite hero amitabh bachchan

సూపర్ స్టార్ అమితాబ్ అంటే బన్నీకి ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మొదటి నుంచి అమితాబ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, షోల్, జంజీర్ సినిమాలను చాలాసార్లు చూసినట్లు తెలిపాడు. ఈ విషయం గురించి తెలియడంతో బన్నీ అభిమానులతోపాటు బిగ్ బి అభిమానులు కూడా సంతోషాన్ని ఫీలవుతున్నారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ మరిన్ని ఘనవిజయాలు సాధిస్తాడని, ప్రస్తుతం పాన్ ఇండియా హీరో స్థాయి నుంచి గ్లోబల్ హీరో స్థాయికి ఎదుగుతాడని నమ్మకంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+