అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి సినిమా గంగోత్రి కాగా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప-2. పేరుకు స్టార్ కిడ్ అయినా బన్నీ మాత్రం ఎప్పుడూ అలా భావించలేదు. ఇందుకు ఆయన సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. మొదటి సినిమా నుంచే డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్స్ విషయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గంగోత్రిలో చీర కట్టుకుని ఓ సాంగ్ లో నటించినా.. పుష్ప-2 లో అదే చీర కట్టుతో తగ్గేదేలే అని విలన్ లను రప్పా రప్పా ఆడించినా అది ఆయనకే సొంతం.

అల్లు అర్జున్ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాడు. అందుకే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వేదం సినిమాలోని పాత్ర ఒకటి. ఆయన కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో వేదం కచ్చితంగా ఉంటుంది. అప్పటికే పెద్ద హీరోగా ఎదిగిన బన్ని.. లీడ్ రోల్ లో కాకుండా పాత్రను నమ్మి నటించి మెప్పించాడు. అందుకే ఈ మూవీ అటు అల్లు అర్జున్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కు కూడా ప్రత్యేకం.

వేదం సినిమాను క్రిష్ తెరకెక్కించారు. ఈ మూవీ 2010 జూన్ 04న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ తో పాటు మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క ఈ మూవీలో వేశ్య పాత్రలో నటించడం విశేషం.

Allu Arjun Gets Emotional on Vedam s 15th Anniversary Shares Heartfelt Post

అయితే తాజాగా ఈ సినిమా వ‌చ్చి నేటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా సినిమాను గుర్తు చేసుకుంటూ అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. "వేదం మూవీ నాకు ప్రత్యేకమైన చిత్రం. నా కెరీర్‌లో ఒక విభిన్నమైన చిత్రం వేదం. ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడికి నా కృతజ్ఞతలు.

అలాగే నాతో పాటు ఈ సినిమాలో నటించిన అనుష్క, మంచు మనోజ్ తో పాటు ఇతర నటీనటులకు కృతజ్ఞతలు. ఈ సినిమాను నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు . ఈ సినిమాను ఆదరించి, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రంగా మార్చిన అభిమానులందరికీ కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆయన పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+