అట్లీ మూవీలో ఏకంగా నాలుగు పాత్రల్లో అల్లు అర్జున్..!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టగా.. పుష్ప 2 అయితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఆయన గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే తమిళ్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. AA 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.

నాలుగు పాత్రల్లో బన్నీ..
ఈ చిత్రంలో అల్లు అర్జున్.. రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారని ముందు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది మూడు క్యారెక్టర్ లు అన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. బన్నీ మూడు తరాలకు చెందిన నలుగురు వ్యక్తుల పాత్రల్లో కనిపించనున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అర్జున్ స్క్రీన్ పై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.
అంతే కాకుండా బన్నీ సైతం కొంచెం పెద్ద ఏజ్ లో ఉన్నట్టు గడ్డానికి రంగు వేసిన ఫోటోలు సైతం వైరల్ అవ్వడం మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇదే కనుక నిజమైతే ఒక సినిమాలో నాలుగు విభిన్న పాత్రల్లో నటించిన ఫస్ట్ యంగ్ హీరో ఆయనే అవుతారు.
మరోవైపు హాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ ఈ సినిమా కోసం పని చేస్తుండగా.. ఈ చిత్రం పునర్జన్మల కాన్సెప్ట్‌తో పాటు సైన్స్ ఫిక్షన్ తో లింక్ అయ్యి రాబోతుందని టాక్ నడుస్తోంది. మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ మూవీలో ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరు పీసీ అవ్వగా.. మిగిలిన వారి గురించి త్వరలోనే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.
-
తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘ముగ్గురు మొనగాళ్లు’ ఎవరో తెలుసా? -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు "మైఖేల్ జాక్సన్" కొరియోగ్రాఫర్ ప్రశంసలు.. -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
‘పుష్ప2’, ‘ధురంధర్’ సినిమాల్లో అసలైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
విడాకులు తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. 4 ఏళ్లకే! -
Mr work From Home : మీ టైటిల్‌కి.. మీ ప్రమోషన్లకి హ్యాట్సాఫ్ !! -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !!












Click it and Unblock the Notifications