భారీగా డ్రాప్ అయిన 'పుష్ప2' కలెక్షన్లు ... బ్రేక్ ఈవెన్ కష్టమే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప2 చిత్రం ఈనెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12వేలకు పైగా స్క్రీన్లలో భారీగా విడుదలైంది. సంచలన విజయాన్ని నమోదుచేస్తూ ముందుకు దూసుకుపోతోంది. తెలుగులోకన్నా హిందీలోనే ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా చూస్తున్నారు. అంత క్రేజ్ పుష్ప2పై ఉంది. తెలుగులో వసూళ్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం టికెట్ ధరలు భారీగా ఉండటమే. అంత ధరలు పెట్టి సినిమాకు వెళ్లి ప్రేక్షకులు ఆహ్లాదం పొందుతాడా? లేదంటే పెట్టిన టికెట్ ధర గురించే ఆలోచిస్తారా? అనేది నిర్మాత, దర్శకుడు, హీరోకే తెలియాలి.

ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు దగ్గరగా
ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు దగ్గరగా ఉంది. ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా రూ.వెయ్యి కోట్లు సాధించే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలకు భారీ ధరలకు ఈ సినిమాను అమ్మడంతో బ్రేక్ ఈవెన్ కు ఇంకా ఈ సినిమా చాలా దూరంలో ఉంది. అమెరికా మార్కెట్ లో 11 రోజులు ముగిసిన తర్వాత ఈ సినిమా కలెక్షన్లు చాలావరకు మందగించాయి. అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా నాలుగు మిలియన్ డాలర్లను రాబట్టాల్సి ఉంది. రెండోవారంలో అక్కడి మార్కెట్ లో ఈ సినిమా పుంజుకోకపోతే బ్రేక్ ఈవెన్ అవదని, సినిమా ఫ్లాప్ కిందకు వస్తుందని తెలుస్తోంది. ఒకరకంగా అక్కడి బయ్యర్లకు నష్టాలు తప్పవు.

allu arjun movie pushpa 2 movie collections heavy drop in america market and telugu states

తెలుగులో బ్రేక్ ఈవెన్ అవుతుందా?
తెలుగులో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది. పుష్ప1 సినిమా కూడా బయ్యర్లకు చాలా ప్రాంతాల్లో నష్టాలను మిగిల్చింది. నిర్మాతలు వారికి డబ్బులు తిరిగివ్వాల్సి వచ్చింది. పుష్ప2 కూడా అలాగే అవుతుందా? లేదంటే తెలుగులో కూడా హిట్ అవుతుందా? అనేది తేలాలంటే మరికొన్ని రోజులు ఓపిక పట్టాలి. హిందీలో మాత్రం లాభాలు కళ్లచూసే అవకాశం ఉంది. అల్లు అర్జున్, రష్మిక, ఫాహాద్ ఫజిల్, జగపతిబాబు, రావు రమేష్, శ్రీతేజ్, అజయ్, అనసూయ, సునీల్ తదితరులు నటించిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్, సామ్ సీఎస్ సంగీతాన్ని అందించారు. తమన్ కూడా అందించినప్పటికీ దాన్ని దర్శకుడు సుకుమార్ వాడలేదు. అయినప్పటికీ అతనికి రూ.3కోట్లు పారితోషికం కింద నిర్మాతలు చెల్లించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+