హైదరాబాద్‌కి బై బై అంటున్న "అల్లు అర్జున్" !!
ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో చిత్రం 'రాకా'. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఆ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఈ క్రమంలోనే బన్నీ నటిస్తున్న ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి.

కాగా ఇటీవల ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ లుక్ తో అల్లు అర్జున్ అందరికీ షాక్ ఇచ్చాడు. అంతే కాకుండా 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అని చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ మరింత హైప్ ను పెంచేసింది.
అయితే అల్లు అర్జున్ హైదరాబాద్‌ను వీడి ముంబైకి మకాం మార్చనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 'రాకా' షూటింగ్ కోసమే అల్లు అర్జున్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై మధ్య నిరంతరం ప్రయాణించడం వల్ల కలిగే అలసట సినిమా నటనపై ప్రభావం చూపకూడదని బన్నీ భావిస్తున్నారు. అందుకే రాబోయే రెండేళ్ల పాటు కేవలం ముంబైలో మాత్రమే ఉంటూ చిత్రానికి పూర్తి సమయం కేటాయించాలని ప్లాన్ చేసినట్టు భావిస్తున్నారు. కేవలం షూటింగ్ నిమిత్తమే కాకుండా, తన పాత్ర కోసం పడుతున్న శ్రమ, నిబద్ధత దృష్ట్యా ఆయన తన కుటుంబంతో సహా ముంబైలో నివసించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతే కాకుండా రాకా సినిమాలో తన కెరీర్‌లోనే మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ పాత్రకు ప్రతిరోజు నాలుగు గంటల ప్రాస్థెటిక్ మేకప్ అవసరం కాగా, దాన్ని తొలగించడానికి మరో రెండు గంటలు పడుతుందని సమాచారం. అంటే కేవలం మేకప్ కోసమే ఆయన రోజుకు ఆరు గంటలు కేటాయించాలి. ఈ క్లిష్టమైన షెడ్యూల్‌లో సమయాన్ని ఆదా చేసుకోవడానికి ముంబైలో ఉండటమే సరైన మార్గంగా ఐకాన్ స్టార్ నిర్ణయించుకున్నారట.
The wait is over.
— Allu Arjun (@alluarjun) April 8, 2026
Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe
ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని బన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారని టాక్ వినిపిస్తుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. 2027 ద్వితీయార్థంలో సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట.












Click it and Unblock the Notifications