చీరలో అల్లు అర్జున్ మాస్ జాతర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రోజుకు రోజుకు తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్నారు. అల్లు అర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్కా రాష్ట్రాల్లో కూడా అభిమానులున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అల్లు అర్జున్‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక పుష్ప సినిమాతో మనోడు ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్పలో అల్లు అర్జున్ నటనకు బాలీవుడ్ అభిమానులు ఫిదా అయ్యారు.
అక్కడి సెలబ్రిటీలు, క్రికెటర్లు సైతం అల్లు అర్జున్ మ్యానరిజాన్ని అనుకరించారంటే ఆయన రేంజ్ ఎంతలా మారిపోయిందో అర్థం అవుతుంది. ఇక తెలుగు సినిమా చరిత్ర ఏర్పడిన దగ్గర నుంచి ఎదురు చూస్తున్న జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సైతం అల్లు అర్జున్‌కే దక్కింది. పుష్పలో నటనకుగాను జాతీయ ఉత్తమ అవార్డు గెలుచుకుని అల్లు అర్జున్ తెలుగు సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించాడు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం పుప్ప-2తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తమిళనాడు అడవుల్లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే అల్లు అర్జున్‌కు సంబంధించి ఓ ఫొటో లీక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ ఫొటోలో అల్లు అర్జున ఓ చీర కట్టుకుని కనిపించారు. బ్లూ చీర కట్టుకుని కూర్చీలో కుర్చొన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫొటోను ఓసారి గమనిస్తే...ఇదేదో జాతరకు సంబంధించినదిగా అర్థం అవుతుంది. దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్‌తో చీర కట్టించి అచ్చం అమ్మవారిలా తయ్యారు చేశారు. పుప్ప-2లో ఇది కీలక సన్నివేశమని ఈ సీన్ థియోటర్లలో అదిరిపోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఆగస్టు 15న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పన్స్ వచ్చింది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ చీర ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications