బాక్సాఫీస్‌కు పూనకాలే..దుమ్ములేపిన పుష్ప-2 ట్రైలర్
సినీ యావత్తు మొత్తం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితమే విడుదలైంది. 2:48 సెకన్ల నిడివి గల ట్రైలర్ ఇరగదీసింది. ట్రైలర్ మాస్ ప్రేక్షకులకు పునకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అదరగొట్టాడని ట్రైలర్‌ను చూస్తే అర్ధం అవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ట్రైలర్ చివర్లో వచ్చిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ఇక పుష్ప అంటే నేషనల్ కాదు..ఇంటర్నేషనల్ అంటూ చెప్పే డైలాగ్ సైతం ఆకట్టుకుంది. మాస్ ర్యాంపేజ్‌తో ట్రైలర్ అదరగొట్టింది.
ట్రైలర్ అందర్ని ఆకట్టుకునేలా కట్ చేయడంలో సుకుమార్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ట్రైలర్‌లో సుక్కు మార్క్ కనిపిస్తోంది. మొదటి పార్ట్‌లో చివర్లో కనిపించిన ఫహద్ ఫాసిల్ , రెండో పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. మొదటి పార్ట్‌లో పుష్ప లవర్‌గా కనిపించిన రష్మికా మండన్న, రెండో పార్ట్‌లో ఆయన భార్యగా కనిపించనున్నారు. ఇక రెండో పార్ట్‌లో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సినిమా లోకం మొత్తం కూడా పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. రూ. 400 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications