అల్లు అర్జున్ vs నాగబాబు; ఆ ట్వీట్ తో బయటపడిన మెగాఫ్యామిలీలో సైలెంట్ వార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలినా, పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ ఒక ట్వీట్ తో సరిపెట్టి, వైసిపి అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇది మెగా ఫ్యామిలీలో కూడా తీవ్ర అసంతృప్తికి కారణమైంది.

అల్లు అర్జున్ పై ట్రోలింగ్
ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించి వైసిపిఅభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. అంతకుముందు ఆయన పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ట్వీట్ చేసినా, వైసిపి అభ్యర్థి కోసం నేరుగా ప్రచారానికి నంద్యాల వెళ్లడం జనసేన నేతలకు, మెగా అభిమానులకు అస్సలు రుచించలేదు. దీనిపై అల్లు అర్జున్ ని టార్గెట్ చేసి పెద్దఎత్తున ట్రోల్ చేశారు.

Allu Arjun vs Nagababu silent war in the mega family came out with that tweet

పోలింగ్ తర్వాత అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ క్రమంలో నిన్న ఎన్నికల పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకున్న అల్లు అర్జున్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. మా మామయ్య పవన్ కళ్యాణ్ కు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

నష్ట నివారణ వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్
నంద్యాలలో రవికి కూడా అలాగే మద్దతు తెలిపానని, నాకు దగ్గర వ్యక్తులు ఎవరైనా సరే రాజకీయంగా మద్దతు ఇవ్వాల్సి వస్తే తప్పక ఇస్తానన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పేర్కొన్న అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా ఫ్యామిలీకి నంద్యాల పర్యటన వల్ల చోటు చేసుకున్న అసంతృప్తి నేపథ్యంలో నష్ట నివారణకు ఈ వ్యాఖ్యలు చేశారు.

నాగబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్
అయితే తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నిన్న ఎన్నికలు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిన నాగబాబు అల్లు అర్జున్ పేరు పెట్టకుండా ఆసక్తికర పోస్ట్ పెట్టారు మాతో ఉంటూ ప్రత్యర్ధులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.

మెగా. అల్లు ఫ్యామిలీ మధ్య గ్యాప్
అయితే ఈ పోస్ట్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టిన పోస్ట్ అని పలువురు జనసైనికులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అన్న విషయం సినీ వర్గాలలో చర్చనీయాంశమైన విషయమే. ఇక ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో వ్యవహరించిన తీరు మరోమారు రెండు కుటుంబాల మధ్య గ్యాప్ ను స్పష్టంగా చెబుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+