జిమ్‌లో అల్లు స్నేహారెడ్డి కసరత్తులు (వీడియో)

అల్లు అర్జున్ గురించి తెలియనివారుంటారేమోకానీ అతని భార్య అల్లు స్నేహారెడ్డి గురించి మాత్రం తెలియనివారుండరు. సినిమాల్లో తన భర్త బిజీగా ఉంటున్నప్పటికీ తను మాత్రం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. కళాశాలతోపాటు ఇతర వ్యాపారాలను కూడా నిర్వహిస్తోంది. ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కొడుకు, కూతురును తీసుకొని కుటుంబ సమేతంగా హాజరవుతుంటారు. అందుకు సంబంధించిన ఫొటోలను స్నేహారెడ్డి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు.

హీరోయిన్లకు తీసిపోని విధంగా తన అందంతో ఆమె నెటిజన్లను ఆకట్టుకుంటుంటారు. ఫాలోయింగ్ కూడా అధికంగా ఉంటోంది. ఇన్ స్ట్రాగ్రామ్ లో 10 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆమె జిమ్ లో వ్యాయామం చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సూపర్ వదినా.. బాగా చేస్తున్నావు.. బాగా కష్టపడుతున్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫిట్ నెస్ ను కాపాడుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తోందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

allu arjun wife allu sneha reddy work out video in jym

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులతో గొడవ జరగడంతో నిర్మాతలు డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారు. ఈ నెల 15నే సినిమా విడుదలై ఉంటే వరుస సెలవులు కలిసివచ్చేవని, కలెక్షన్లు భారీగా వచ్చేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం మెగా కుటుంబానికి దూరం జరిగిన బన్నీ తనను తాను వ్యక్తిగతంగానే నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+