మెగా ఫ్యామిలీతో పెట్టుకొని తోక ముడిచినట్లేనా?
తెలుగు సినీ పరిశ్రమను కేవలం నాలుగు కుటుంబాలే శాసిస్తున్నాయని, వారిచేతుల్లోనే పరిశ్రమ ఉందని, ఈ నాలుగు కుటుంబాలు చెప్పిందే వేదం అన్నట్లుగా జరుగుతోందంటూ కొన్నాళ్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ నాలుగు కుటుంబాల్లో మెగా కుటుంబం ఒకటి. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ కుటుంబం నుంచి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరిలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలోనే పవన్ కు ట్వీట్ ద్వారా మద్దతిచ్చిన అల్లు అర్జున్ నంద్యాల నుంచి పోటీచేస్తున్న తన మిత్రుడు కిషోర్ రెడ్డికి మద్దతిచ్చేందుకు స్వయంగా సతీసమేతంగా నంద్యాల వెళ్లారు. ఆ విషయంమీదే పవన్ కల్యాణ్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతోంది.
ఆ సినిమాను ఫ్లాప్ చేసిన మెగా అభిమానులు
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కావడంతో డిసెంబరు ఆరోతేదీకి వాయిదా పడింది. ఈ నిర్ణయానికి కొద్దిరోజుల ముందునుంచే పవన్ కల్యాణ్ అభిమానులు, మెగా అభిమానులంతా అల్లు అర్జున్ పై ట్రోలింగ్ ప్రారంభించారు. ఆ ట్రోలింగ్ ప్రస్తుతం తీవ్రదశలో ఉంది. గతంలో పవన్ కల్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అనే డైలాగ్ ను అల్లు అర్జున్ వాడారు. దీంతో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాను మెగా అభిమానులు ఫ్లాప్ చేశారు. ఈ సినిమాకు కలెక్షన్లు కొంచెం కూడా రాలేదు.

అల్లు అర్జున్ ఏం చేస్తారో?
తాజాగా అదే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే అప్పటికన్నా ఇప్పుడు మరింత తీవ్ర దశలో ఉంది. ఈ సమయంలో పుష్ప2ను విడుదల చేస్తే కలెక్షన్లు రావు.. అసలే పార్ట్2పై నమ్మకంతో రూ.400 కోట్లకుపైగా ఖర్చుపెట్టామనే భావనలో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం పుష్ప2 విడుదలైతే ఫ్లాప్ అవడం ఖాయమనే నిర్ణయానికి వారు వచ్చారని, అదే కాకుండా షూటింగ్ ఆలస్యంగా జరుగుతుండటం కూడా నిర్మాతలకు వరంలా మారింది. డిసెంబరు నెలకల్లా ఈ తీవ్రత తగ్గుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే మెగా అభిమానులతో పెట్టుకుంటే ఇప్పుడే కాదు.. ఎప్పుడు విడుదల చేసినా సినిమాను ఫ్లాప్ చేయడం ఖాయమని వారంతా పోస్టులు పెడుతుండటంతోపాటు కామెంట్లు చేస్తున్నారు. దీనికి విరుగుడుగా అల్లు అర్జున్ ఏం చేస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications